English   

రాజమౌళి కరోనా కథ.. అసలేం జరిగింది.. ఎలా వచ్చింది..

 Rajamouli
2020-08-01 10:28:02

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం కరోనా వైరస్ బారిన పడింది అని తెలియగానే సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఆయనకు కరోనా రావడం ఏంటి.. ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు కదా.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎలా ఆ వైరస్ బారిన పడ్డారు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. దాంతోపాటే సోషల్ మీడియాలో ఆయనకు పరామర్శల వెల్లువ కూడా మొదలైపోయింది. సినిమా ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ కు కరోనా వైరస్ సోకిన తర్వాత అంత షాకింగ్ న్యూస్ రాజమౌళికి కరోనా వైరస్ రావడమే. మీరు మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము సార్ అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ రాజమౌళికి సపోర్ట్ గా నిలబడ్డారు.

అన్నింటికి మించి కరోనా వైరస్ ను జయించిన నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా ఈ విషయంపై స్పందించాడు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని చెప్తూనే గుడ్లు ఎక్కువగా తినండి సార్ అంటూ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ తగ్గిపోవడానికి గుడ్ల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది అంటూ చెబుతున్నాడు బండ్ల గణేష్. తనకు వచ్చిన వైరస్ తగ్గిపోవడం వెనక కోడిగుడ్ల కూడా చాలా ఉంది అని ఆయన ట్వీట్ చేశాడు. దాంతో పాటు పౌష్టికాహారం తింటే సరిపోతుంది అంటూ బండ్ల గణేష్ చెప్పాడు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా రాజమౌళి ఉద్దేశించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఆయనకు వైరస్ సోకింది అనే విషయం తెలియగానే వర్మ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశాడు. సార్ వెంటనే మీ సైనికుడు బాహుబలిని పిలిచి ఆ వైరస్ ఒక్క తన్ను తన్నుమనండి దెబ్బకి పారిపోతుంది అంటూ ట్వీట్ చేసాడు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ జోక్స్ పక్కన పెడితే మీరు మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

వీళ్లు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ గురించి ఇంకా చాలా మంది రాజమౌళికి ఫోన్ చేసి  పరామర్శిస్తున్నారు. కొన్ని రోజులుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా జ్వరంతో బాధ పడుతూ ఉండటం చూసి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని రాజమౌళి ట్వీట్ చేశాడు. అయితే ప్రస్తుతం షూటింగ్లు లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు రాజమౌళి.. ఆయన కుటుంబ సభ్యులు. ఇలాంటి సమయంలో వాళ్లకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది అంటూ ఆరా తీస్తున్నారు. బయటకు వెళ్లకపోయినా కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుంది. ఈ సమయంలోనే కొందరు టెక్నికల్ వ్యక్తులను రాజమౌళి కలిశాడని తెలుస్తుంది. వాళ్ల నుంచి ఈ వైరస్ సోకి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుటుంబంలో అందరూ కరోనా బారిన పడటంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా కనిపిస్తున్నారు. వైరస్ సోకినంత మాత్రాన ఏమీ కాదని మానసిక ధైర్యం అన్నింటికీ మించిన మందు అంటున్నాడు దర్శక ధీరుడు. వైరస్ తగ్గిపోయిన తర్వాత మళ్లీ అభిమానులతో మాట్లాడతానని చెప్పాడు రాజమౌళి. 

More Related Stories