English   

రాజమౌళి ఎన్టీఆర్ కు హ్యాండిచ్చాడుగా..?

ntr-rajamouli
2018-05-21 07:01:33

కొందరికి సంబంధించిన వార్తలు రూమర్స్ అయినా జనం ఆసక్తిగా చూస్తారు. అది నిజమే అనుకుంటారు కూడా. ఇప్పుడు రాజమౌళి, ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన విధానం కూడా అలాంటిదే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా రాబోతోందని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలోనే ఇప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. నిన్నటి వరకూ ఏదో ఉందనుకున్న వాళ్లందరినీ జక్కన్న ఒక్కసారిగా నిరాశపరిచాడు. అవును మీరు చదువుతున్నది నిజమే. కానీ అది ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం కాదులెండి.. ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి నుంచి ఓ స్పెషల్ ట్రీట్ వస్తుందనే ప్రచారం విపరీతంగా జరిగింది. అది కూడా ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తోన్న ‘‘ఆర్.ఆర్.ఆర్’’ నుంచే అని కూడా అన్నారు. ఇక రాజమౌళి, ఎన్టీఆర్ ల రిలేషన్ గురించి అందరికీ తెలుసు.. కాబట్టి ఆయన కూడా ఏదో ఒక స్పెషల్ రిలీజ్ చేస్తాడు అనుకున్నారు. కానీ చేయలేదు. సరికదా తమ సినిమా బ్యానర్ నుంచి ఎన్టీఆర్ కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ ఏ పేపర్లో కూడా చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు. సరే ఇది నిర్మాత పని అనుకోవచ్చు. కానీ రాజమౌళి చెబితే నిర్మాత చేయకుండా ఉంటాడా..? ఈ విషయాన్ని పక్కన బెడితే ఆ మధ్య  ఎన్టీఆర్, రామ్ చరణ్ లిద్దర్నీ లండన్ తీసుకువెళ్లి మరీ లుక్ టెస్ట్ చేశారు. అంటే తమ సినిమాకు సంబంధించిన లుక్ కోసం కొన్ని ఫోటోషూట్స్ కూడా చేశారు. కనీసం అవైనా రిలీజ్ చేసి ఉంటే ఆ ట్రీట్ వేరే ఉండేదేమో కదా.. 

More Related Stories