English   

పాకిస్తాన్ వాంటెడ్ లిస్ట్ లో రాజమౌళి

Rajamouli-pakisthan
2018-03-28 13:39:21

బాహుబలి.. భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన సినిమా. ఈ సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెరిగిందో వేరే చెప్పక్కర్లేదు. ఆయన్ని చూడాలని ఇప్పటికే చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పాకిస్తాన్ వాంటెడ్ లిస్ట్ లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదూ..యస్.. రాజమౌళి పాకిస్తాన్ వాంటెడ్ లిస్ట్ లోనే ఉన్నాడు. అయితే ఇదేమీ ఉగ్రవాద చర్య కాదు. చిత్రవాద చర్య. అర్థం కాలేదు కదూ. రాజమౌళిని పాకిస్తాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని అక్కడి నుంచి ఆహ్వానం అందింది. నమ్మలేకపోతున్నారు కదూ.. కానీ ఇది నిజం. ఈ విషయం స్వయంగా జక్కన్నే వెల్లడించాడు. అంటే బాహుబలి సినిమా గొప్పదనాన్ని పాక్ కూడా గుర్తించినట్టే.. 

వాల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ బాహుబలి దాదాపు అన్ని చిత్రోత్సవాల్లో పాల్గొంది. ఆ స్థాయి క్రేజ్ ఉందా సినిమాకు. ఇందుకోసం రాజమౌళి కూడా ఎన్నో దేశాలు పర్యటించాడు. తన సినిమా ప్రమోషన్స్ నుంచి ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇన్విటేషన్స్ వరకూ ఎన్నో దేశాలు తిరిగాడు. కానీ అనూహ్యంగా ఆహ్వానం పాకిస్తాన్ నుంచి కూడా వస్తుందనుకోలేదు. అందుకే రాజమౌళి చాలా ఎగ్సైట్ అవుతున్నాడు. హిందీలోనూ బాహుబలి ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది. ఈ విషయం పాకిస్తాన్ కూ తెలుసు. అందుకే త్వరలో కరాచీలో జరగబోయే పాకిస్తాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా రాజమౌళికి ఆహ్వానం పంపించింది పాకిస్తాన్. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వారిలో ఇప్పటికే చాలామంది రాజమౌళికి, రాజమౌళీ చాలామందికి తెలుసు. కానీ పాకిస్తాన్ నుంచి ఆహ్వానం ఊహించనిది. అందుకే రాజమౌళి ఈ విషయాన్ని విపరీతమైన ఆనందంతో షేర్ చేసుకుంటున్నాడు.  

More Related Stories