English   

బిజినెస్ షురూ చేసిన రాజ‌మౌళి..

Rajamouli-business

రాజ‌మౌళికి సినిమాలు కాకుండా ఇంకా చాలా విష‌యాల్లో ప్రావీణ్యం ఉందండోయ్. కాక‌పోతే సింహాలో బాల‌య్య‌లా ఇన్నాళ్లు ఒక‌వైపే చూపించాడంతే. ఇప్పుడు రెండోవైపు కూడా చూపిస్తున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం ఓ బిజినెస్ షురూ చేసాడు. అది కూడా త‌న మిత్రుడు శోభు యార్ల‌గ‌డ్డ‌తో క‌లిసి. స్మార్ట్ వాచ్ ల బిజినెస్ లోకి రాజ‌మౌళి అడుగుపెట్టాడు. అస‌లే ఇప్పుడు ఈయ‌నకు గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది. ఇక ఇప్పుడు దానికితోడు కాలం నా ప్రేయ‌సిలే అంటూ వాచ్ ల బిజినెస్ మొద‌లుపెట్టాడు. క‌న్స్యూమెక్స్ కంపెనీలో త‌న ఫ్రెండ్ తో క‌లిసి ఇన్వెస్ట్ చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. గ‌తేడాదే ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టినా కూడా ఇన్నాళ్లూ ఈ ప్రాడ‌క్ట్స్ రెడీ కాలేదు. ఇక ఇప్పుడు ఇది కూడా మొద‌లైపోయింది. న‌వంబ‌ర్ నుంచి ఈ వాచ్ లు మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లు మ‌న ప‌ల్స్ రేట్ తో పాటు బిపిని కూడా చూపిస్తాయి. ఇలాంటి మోడ్ర‌న్ వాచ్ ల కంపెనీతో టై అప్ అయిపోయాడు రాజ‌మౌళి. మ‌రోవైపు త‌న మ‌ల్టీస్టార‌ర్ ప‌నుల్లోనూ బిజీగా ఉన్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్కనుంది. అటు సినిమాలు.. ఇటు బిజినెస్ రెండు వైపులా దున్నేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

More Related Stories