English   

రాజ‌మౌళి కూడా రాశిని న‌మ్మాడా..?

rajamouli and rashi khanna
2018-02-21 15:16:31

తెలుగులో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ కాంబినేష‌న్ అంటే రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో వ‌స్తోన్న సినిమానే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తో మ‌ల్టీస్టార‌ర్ గా వ‌స్తోన్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలున్నాయి. రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డం, రాజామౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌ది మోస్ట్ స‌క్స‌స్ ఫుల్ కాంబినేష‌న్ కావ‌డం తో బిజినెస్ వ‌ర్గాల్లోనూ ఈ మూవీపై ఎక్స్ పెక్టేష‌న్స్  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటోన్న ఈమూవీ జూలై లేదా ఆగ‌స్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మూవీలో న‌టించే ఇత‌ర తారాగ‌ణం విష‌యం మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.కానీ హీరోయిన్ విష‌యంలో రాజ‌మౌళి రాశిని న‌మ్మాడ‌నే వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.తొలిప్రేమ‌తో భారీ హిట్ సొంతం చేసుకోవ‌డమే కాదు.. తన భారీ ప‌ర్స‌నాలిటీ కూడా త‌గ్గించుకుని స్లిమ్ గా మారింది రాశిఖ‌న్నా. ఇందులో త‌న న‌ట‌న‌కు కూడా మంచి మార్కులు ప‌డుతున్నాయి. దీంతో రాశి ఖ‌న్నాను ఓ హీరోయిన్ గా తీసుకోవాల‌నుకుంటున్నాడ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే రాశి ఆల్రెడీ మెగా హీరోల‌తో చేసింది కాబ‌ట్టి ఈసారి ఎన్టీఆర్ తో చేయించే చాన్సుందంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ స‌ర‌స‌న చేసే హీరోయిన్ మూడునాలుగు భాష‌ల్లో తెలిసిన బ్యూటీ అయితే బావుంటుంద‌నేది కూడా జ‌క్క‌న్న టీమ్ భావిస్తోంద‌ట‌. అంటే అప్పుడు నిజంగా రాశిని తీసుకుంటే త‌ను చ‌ర‌ణ్ తోనే చేయాల్సి ఉంటుంది. ఇదే విష‌యంలో రాశిఖ‌న్నా కూడా రాజ‌మౌళితో ప‌నిచేయ‌డం త‌న డ్రీమ్ అని ఓసారి చెప్పింది. ఇప్పుడు వ‌స్తోన్న రూమ‌ర్స్ చూస్తోంటే రాశి క‌ల నెర‌వేరేలానే ఉంది. కానీ అటు రాజ‌మౌళి మ‌న‌సులో ఏముందనే విష‌యం ఇంకా క్లారిటీగా ఎవ‌రికీ తెలియ‌దు.

More Related Stories