English   

బిగ్ బాస్ లోకి రాజమౌళి..

rajamouli
2018-07-29 16:04:45

అవును.. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం కూడా. నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాజమౌళి వచ్చేసాడు. రావడమే కాదు.. గంటలు గంటలు అక్కడే ఉన్నాడు కూడా. హౌజ్ లో రచ్చ జరగడానికి కూడా కారణం అయ్యాడు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? బాబు గోగినేని, కౌశల్ రూపంలోనే రాజమౌళి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు. ఆ తర్వాత నాని కూడా రాజమౌళి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన రచ్చకు ప్రధాన కారణం రాజమౌళినే. అసలు విషయం అంతా ఈయనపైనే రైజ్ అయింది. కొన్ని రోజలు కింద బిగ్ బాస్ లో రాజమౌళి టాపిక్ తీసుకొచ్చాడు బాబు గోగినేని. ఆయన నాస్తికుడు అని.. అయినా కూడా గుడికి వెళ్లాడనే దగ్గర విషయం మొదలైంది. ఆయన్ని కించపరచడం మంచిది కాదంటూ కౌశల్ కూడా బాబును నామినేట్ చేసాడు. ఇక నాని సీన్ లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. 

అసలు రాజమౌళితో బిగ్ బాస్ తో సంబంధం ఏంటి..? ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యాడు నాని. దాంతో పాటు బాబు గోగినేనిని కూడా ఆడుకున్నాడు నాని. మీరు చాలా పెద్ద మనిషి సర్.. మీరు ఓపెన్ అయితే ఇలా ఉంటుందని ఊహించలేదు.. దయచేసి లేనిపోని ఇష్యూలను హౌజ్ లో పెంచొద్దు సర్ అంటూ బాబుపై ఫైర్ అయ్యాడు నాని. రాజమౌళి గుడికి వెళ్లడాన్ని తప్పుగా ఎలా చూస్తారు.. ఆయన తన ఫ్యామిలీకి విలువ ఇచ్చి గుళ్లకు వెళ్లారు అందులో తప్పేంటని ప్రశ్నించారు. దాంతోపాటు కౌశల్ పై కూడా సీరియస్ అయ్యాడు నాని. ఈ వారం సీన్ చూసిన తర్వాత రాబోయే వారాల్లో నాని ఇంకెంత సీరియస్ గా ఉంటాయో అర్థం అయిపోతుంది. ఇప్పట్నుంచీ ఎవరైనా తప్పు చేసినా కూడా మొహం మీదే కడిగేయాలని ఫిక్స్ అయిపోయాడు న్యాచురల్ స్టార్. ఈయన తీరుతో బిగ్ బాస్ పై ఇప్పుడు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోతుంది. 

More Related Stories