English   

బాబోయ్.. రాజమౌళి శిష్యులు

director rajamouli

చెట్టుపేరు చెప్పి కాయలు అమ్మొచ్చు కానీ దాని రుచిని అమ్మలేం. అలాగే తెలుగు పరిశ్రమలో ఓ హిట్ డైరెక్టర్ వద్ద పనిచేసినంత మాత్రాన వాళ్లూ ఆ రేంజ్ హిట్స్ ఇస్తారనే గ్యారెంటీ లేదు. ఏ హిట్ కైనా కథ, ప్రతిభే కీలకం. అంతేకానీ ఫలానా దర్శకుడి వద్ద పనిచేశానంటే వర్కవుట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ మాట ఓపెనింగ్స్ కూడా రావు. మిగతా వారి సంగతేమో కానీ... రాజమౌళి వద్ద పనిచేసి దర్శకులైన ఎవరూ ఇప్పటి వరకూ మంచి హిట్ ఇవ్వలేదు సరికదా అదిరిపోయే ఫ్లాపులు ఇచ్చారు.. ఇస్తున్నారు. 
మరో విషయం ఏంటంటే అసలు రాజమౌళి శిష్యులుగా వచ్చేవారు కూడా చాలా అంటే చాలా తక్కువ. ఇక ఆ మధ్య ఆయన శిష్యుడుగా వచ్చిన మహదేవన్ అనే దర్శకుడు ఇచ్చిన ఫ్లాపులు జక్కన్నను కూడా సర్ ప్రైజ్ చేశారు. నితిన్ తో ద్రోణ, బాలకృష్ణ తో మిత్రుడు, తర్వాత లావణ్యత్రిపాఠి, నవీన్ చంద్ర వంటి క్రేజీ కాంబోతో చేసిన లచ్చిందేవికి లెక్కుంది. ఇవన్నీ లెక్కలను తారుమారు చేసినవే.

తర్వాత రాజమౌళి శిష్యుడుగా వచ్చిన దిక్కులు చూడకురామయ్యా అంటూ సెన్సిబుల్ హిట్ కొట్టాడు దర్శకుడు త్రికోటి. ఆయన క్యాంప్ నుంచి వచ్చిన దర్శకులు చేసిన సినిమాల్లో ఇదే ఫస్ట హిట్. కానీ అదే దర్శకుడు లేటెస్ట్ గా జువ్వ అనే సినిమా చేశాడు. మొన్న విడుదలైన ఈ మూవీ చూస్తే అసలు దిక్కులు చూడకురామయ్యను త్రికోటే డైరెక్ట్ చేశాడా అనిపించకమానదు. ఆ స్థాయిలో పరమ బోరింగ్ గా ఉందీ మూవీ. కథ పాతదైనా కథనం కూడా ఏ మాత్రం ఆసక్తిని కలిగించదు. జువ్వ విషయంలో సంగీతం, సినిమాటోగ్రఫీ, బడ్జెట అన్నీ హండ్రెడ్ పర్సెంట్ బావున్నాయి. కానీ వాటిని సక్రమంగా వినియోగించుకోవడలో దర్శకుడి వైఫల్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది. మొత్తంగా ఇప్పుడు రాజమౌళి శిష్యుడిని అని చెప్పుకుని ఎవరైనా సినిమా చేస్తానంటే చాలు.. చాలామంది నిర్మాతలు భయపడుతున్నారు. మరి జక్కన్న తన శిష్యులను ఇలా తయారు చేస్తున్నాడేంటో.. ?
 

More Related Stories