English   

రాజమౌళి కూడా 80లకే వెళుతున్నాడా..?

Rajamouli-RRR
2018-04-09 14:09:11

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన కాంబినేషన్ ఆర్ఆర్ఆర్. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు సంబంధించిన కథేంటా అని ఇప్పటికే ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. రీసెంట్ గా స్టోరీ లైన్ గురించి చరణ్, తారక్ లను అడిగినా మాకూ తెలియదని చెప్పి మరింత ఆశ్చర్యపరిచారు. అయితే ఈ మల్టీస్టారర్ కథ కూడా పీరియడ్ ఫిల్మ్ గానే రాబోతోందనేది లేటెస్ట్ న్యూస్. ఇది మూడు కాలాల్లో సాగే కథగా రాజమౌళి చూపించబోతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 1980ల కాలంలో ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ కథ సాగబోతోందంటున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. త్రివిక్రమ్ సినిమా కోసం ఫిట్ గా కనిపిస్తున్నా.. ఆ ఫిట్ నెస్ అంతా రాజమౌళి సినిమలోనే ఉపయోగించబోతున్నాడనేది మరో వెర్షన్. ఇక రామ్ చరణ్ హార్స్ రైడర్ గా కనిపిస్తాడట. ఆ విషయంలో ఆల్రెడీ తను ఎక్స్ పర్టే కాబట్టి కొత్తగా నేర్చుకునేదేం లేదు అనుకోవచ్చు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉండే కాంట్రాస్టే సినిమాలో హైలెట్ కాబోతోందట. అంటే ఓ బాక్సర్, ఓ హార్స్ రైడర్ ల మధ్య వైరమో స్నేహమో, లేదంటే ఇంకేదో కలిపి ఈ కథను నడిపిస్తుందనుకోవచ్చు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీ 2020లో విడుదల కాబోతోంది. అయితే 1980లో మొదలయ్యే ఈ కథ 2020 వరకూ వస్తుందని సమాచారం. సో.. మొత్తంగా ఈ కథకు మూలం ఇదే అన్న విషయం తేలిపోయింది. కాకపోతే అందులో రాజమౌళి మార్క్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా ఉంటుంది కాబట్టి. అయితే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి ఇది కూడా దేశవ్యాప్తంగా విడుదల చేసే చాన్స్ పుష్కలంగా ఉంది.
 

More Related Stories