English   

రాజమౌళి మల్టీస్టారర్ ఆర్. ఆర్.ఆర్. 

Rajamouli-ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించబోతోన్న మాసివ్ మల్టీస్టారర్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయింది. దీనికి జక్కన్న క్రియేటివ్ గా త్రిపుల్ ఆర్ అని చెప్పాడు. ఆర్ ఫర్ రాజమౌళి, ఆర్ ఫర్ రామ్ చరణ్, ఆర్ ఫర్ ఎన్టీఆర్ లోని చివరి ఆర్.. ఇలా త్రిపుల్ ఆర్ గా ఈ ప్రాజెక్ట్ కు వర్కింగ్ టైటిల్ లా పెట్టేశారు. సింపుల్ గా ఆర్. క్యూబ్ అనుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆడియన్స్ కు తెలిసింది కొన్నాళ్ల క్రితమే. కానీ బాహుబలి-2కు హేంగోవర్ నుంచి బయటకు రాగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. యస్.. గతేడాది నవంబర్ నుంచే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాట. ఆ విషయం ఈ టైటన్ వీడియోతో పాటు తెలియజేశారు. మొత్తంగా ఈ మాసివ్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అయింది. ఇక షూటింగ్ తో పాటు ఇతర డీటెయిల్స్ అంటే క్యాస్టింగ్, టెక్నీషియన్స్ కు సంబంధించిన వార్తలు త్వరలోనే అనౌన్స్ అవుతాయి. 
 

More Related Stories