English   

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కు అడ్డంకులు.. 

Rajamouli-ntr
2018-02-16 14:47:09

అవునా.. రాజ‌మౌళి సినిమాకు అడ్డుప‌డే ధైర్యం ఎవ‌రికి ఉంటుంది..? ఇంత‌కీ ఎవ‌రు ఈ చిత్రాన్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారు అనుకుంటున్నారా..? ఈ సినిమాకు అడ్డుప‌డుతున్న‌ది ఎవ‌రో కాదు.. క‌థే. అవును.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా క‌థే సిద్ధం కాలేదు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ వైపు క‌థ వండుతూనే ఉన్నాడు కానీ రాజ‌మౌళికి మాత్రం అది న‌చ్చ‌ట్లేద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే రెండు మూడు వ‌ర్ష‌న్లు విన్న త‌ర్వాత కూడా తండ్రి చెప్పిన క‌థ‌ను పెద్ద‌గా ఆక‌లింపు చేసుకోలేక‌పోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. దాంతో మ‌రో వ‌ర్ష‌న్ సిద్ధం చేయాల్సిందిగా కోరాడు. ఇప్పుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఇదే ప‌నిలో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు రాజ‌మౌళి కూడా ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప‌క్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నాడు. 

రాజమౌళి త‌న టీమ్ రెండు ముక్కలుగా విడకొట్టి ఓ భాగం చ‌ర‌ణ్ కోసం.. మ‌రోభాగం ఎన్టీఆర్ కోసం ప‌గ‌లూ రాత్రి ప‌ని చేయ‌బోతున్నాయి. ఇందులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య అద్భుత‌మైన స‌న్నివేశాలు రాయాలంటూ ఇప్ప‌టికే త‌న టీంను రాజ‌మౌళి కోరిన‌ట్లు తెలుస్తుంది. ఒక్క‌సారి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథ సిద్ధం చేయ‌డం పూర్తైపోతే.. స్క్రీన్ ప్లే ప‌నిలో బిజీ కానున్నాడు రాజ‌మౌళి. అక్టోబ‌ర్ నుంచి అనుకున్న సినిమా కాస్తా.. ఇప్పుడు కాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. అది కూడా క‌థా జాప్యం వ‌ల్లే కానీ హీరోల‌తో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు. షూటింగ్ మొద‌లుపెట్టే ముందే.. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పై టెస్ట్ క‌ట్ కూడా చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి.
 
ఇన్నాళ్లు ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు ఉంటుందని.. ఇదో బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌స్తోన్న సినిమా అనే వార్త‌లు వినిపించాయి. కానీ అవేవీ కాదు.. ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. అంతేకాదు.. ఈ చిత్రం కోసం హీరోలిద్ద‌రూ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదు. కేవ‌లం కోటా మాత్ర‌మే తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కేవ‌లం 40 కోట్లతో సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. రెమ్యునరేషన్ లేకుండా రైట్స్ మాత్ర‌మే తీసుకోవాల‌ని చూస్తున్నారు హీరోలు. ఇదే చేస్తే నిర్మాత‌ల‌కు కూడా లాభ‌మే. ఎలాగూ రాజ‌మౌళి సినిమా అంటే హాట్ కేక్ క‌దా. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి రాజ‌మౌళికి స‌రైన క‌థ ఎప్పుడు దొరుకుతుందో చూడాలిక‌..!

More Related Stories