English   

రాజమౌళి మల్టీస్టారర్.. ఓ బ్యాడ్ న్యూస్

rrr
2018-07-15 19:22:52

రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కే సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ‘ఆర్ఆర్ఆర్’అని పిలుచుకుంటున్నారు. ఇదే టైటిల్ మాత్రం కాకపోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ తో పాటు మరో బ్యాడ్ న్యూస్ ను కూడా పంపిస్తోంది ఈ మూవీ టీమ్. ఇందులో గుడ్డేంటంటే.. ఈ సినిమా అక్టోబర్ లోనే అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవగా రాబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. వీరి కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ. అటు రామ్ చరణ్ కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ రెండు సినిమాలు కూడా అక్టోబర్ లోనే విడుదల కానున్నాయి. సో.. ఇవి పూర్తి కాగానే జక్కన్న సినిమాకు సిద్ధమవుతారు.. మరి ఇందులో బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా..?

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చే సినిమా వచ్చ యేడాది విడుదల కావడం లేదు. అవును అంతా అనుకుంటున్నట్టు ఈ మూవీ 2019లో రాదు. 2020లో విడుదలవుతుందని సమాచారం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పటి వరకూ ఈ మూవీ ఏ జానర్ లో ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే ఏ జానర్ లో ఉన్నా.. ఆర్ఆర్ఆర్ కు విజువల్ ఎఫెక్ట్స్ తో చాలా పనుంటుందట. ఆ కారణంగానే ఈ సినిమా చాలా లేట్ అవుతుందని టాక్. మరోవైపు ఇద్దరు హీరోలున్నారు.. కాబట్టి.. షూటింగ్ కూడా యేడాదిన్నరకు పైగా పట్టొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత మరికొంత కాలం విజువల్ ఎఫెక్ట్స్ కు తీసుకుంటారు. టోటల్ గా రెండేళ్లు పడుతుందన్నమాట. ఆ రకంగా చూస్తే ఈ మూవీ 2020 వేసవిలో అయినా వస్తుందనేది డౌటే. మరి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ప్రాజెక్ట్ ఇంత లేట్ గా వస్తే ఆడియన్స్ ఉస్సూరుమనరు..

More Related Stories