English   

ఫోర్బ్స్ లిస్ట్ లో రాజ‌మౌళి ఎక్క‌డ‌..?

Rajamouli
2018-12-06 09:27:13

ఫోర్బ్స్ లిస్ట్ విడుద‌లైన క్ష‌ణం నుంచి ఒక్క‌రి పేరు మిస్ అయిందే అని అభిమానులు అంతా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అస‌లు ఆయ‌న పేరు ఎలా మిస్ అయింద‌బ్బా అంటూ అంతా జుట్టు పీక్కుంటున్నారు. అత‌డే వ‌న్ అండ్ ఓన్లీ రాజ‌మౌళి. ఫోర్బ్స్ 2018 జాబితాలో రాజ‌మౌళి పేరెక్క‌డ క‌న‌బ‌డ‌క‌పోవ‌డం నిజంగా విడ్డూర‌మే. ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రుగా ఉన్న రాజ‌మౌళి పేరు ఫోర్బ్స్ లిస్ట్ లో లేక‌పోవ‌డం ఏంటి మ‌రి..? ఇక ఈయ‌న‌తో పాటు ప్ర‌తీసారి టాప్ 20లో క‌నిపించే మ‌హేష్ బాబు ఈ సారి ఏకంగా 30ల్లోకి వెళ్లిపోయాడు. ఈయ‌న ఏకంగా 24 కోట్ల సంపాద‌న‌తో 33వ స్థానంలో ప‌డిపోయాడు. తెలుగు నుంచి అస‌లు చాలా మంది సెలెబ్రెటీస్ ఉంటారేమో అనుకుంటే అలాంటి వాళ్లు ఒక్క‌రు కూడా లేక‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్యమే. అస‌లు ఊహించ‌ని విధంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇవ్వ‌డం.. ఆయ‌న‌తో పాటు విజ‌య్ సేతుప‌తి లాంటి హీరోలు కూడా ముందే ఉండ‌టం ఆశ్చ‌ర్య‌మే. అందుకే ఫోర్బ్స్ ఎప్పుడూ విచిత్ర‌మే. ఈ సారి కూడా ఇదే జ‌రిగింది. పేరు వ‌చ్చిన వాళ్లు సంతోషిస్తున్నారు. రాక‌పోతే ఇంకా సంతోషిస్తున్నారు. ఎంతైనా ట్యాక్స్ క‌ట్టే గోల ఉండ‌దు క‌దా. ఈ ఫోర్బ్స్ లో ఎవ‌రి పేరు ఉన్నా లేక‌పోయినా రాజ‌మౌళి పేరు లేక‌పోవ‌డం మాత్రం నిజంగానే విడ్డూరం. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన కొర‌టాల శివ కూడా 20 కోట్ల‌తో ఇందులో చోటు సంపాదించుకున్నాడు కానీ ద‌ర్శ‌క ధీరుడి పేరు మాత్రం క‌నిపించ‌లేదు.

More Related Stories