అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి

రాజమౌళి గత కొన్ని రోజులుగా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంటున్నాడు. అవును.. అక్కడ ఓ భారీ సెట్ కూడా వేయిస్తున్నాడు. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో జరుగుతోంది. ఈ పనులు తనే చూసుకుంటున్నాడు కూడా. మరి ఇదంతా ఎన్టీఆర్, చరణ్ సినిమాల కోసం అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. బట్ ఈ ఫ్యాక్టరీలో ఇప్పుడు వేస్తోన్న సెట్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెబుతన్నారు. అందుకే రాజమౌళి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడంటున్నారు. సో.. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా మొదలయ్యాయనుకోవచ్చు.
మామూలుగా అల్యూమినియం ఫ్యాక్టరీ అనగానే మనకు భారీ యాక్షన్ సీన్సే గుర్తొస్తాయి. అది నిజమే అయినా.. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఇప్పుడు వేయిస్తోన్న సెట్ లో కొన్ని కీలకమైన సీన్స్ కూడా ఉంటాయట. వచ్చే చివర్లో కానీ, ఆగస్ట్ లో కానీ షూటింగ్ ప్రారంభం కావొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో, రామ్ చరణ్ బోయపాటి మూవీతో బిజిబిజీగా ఉన్నారు. ఆరెండూ పూర్తి కాగానే ఇద్దరూ ఈ సినిమా మొదలుపెడతారు. అయితే ఆ రెండు సినిమాలూ దసరాకే విడుదల కాబోతుండటం అభిమానులకు డబుల్ బొనాంజా..