English   

రంగ‌స్థ‌లం చూసిన రాజ‌మౌళి..

Rajamouli

ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ క్రిటిక్ ఎవ‌రంటే రాజ‌మౌళి అంటారు హీరోలంతా. ఎందుకంటే త‌న‌కు కావాల్సిన సినిమాలు ప్ర‌తీసారి తొలిరోజే చూస్తుంటాడు రాజ‌మౌళి. కానీ రంగ‌స్థ‌లం మాత్రం కాస్త ఆల‌స్యంగా చూసాడు జ‌క్క‌న్న‌. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. మొన్నీమ‌ధ్యే క‌రాచీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కోసం పాకిస్థాన్ వెళ్లొచ్చాడు రాజ‌మౌళి. అక్క‌డే మూడు రోజులు ఉండాల్సి వ‌చ్చింది. దాంతో రంగ‌స్థ‌లం చూడ్డానికి ఆయ‌న‌కు టైమ్ దొర‌క‌లేదు. ఇక ఇప్పుడు ఇండియాకు వ‌చ్చాడు.. వ‌చ్చీ రాగానే ఫ‌స్ట్ రంగ‌స్థ‌లం చూసాడు. చూసి చూడగానే త‌న వ్యూ ను ట్వీట్ చేసాడు. ఈ సినిమా చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు రాజ‌మౌళి. ఎందుకంటే న‌టుడిగా కూడా చ‌ర‌ణ్ ఎదిగిన విధానం ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత ఈ సినిమాలో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. 

చిట్టిబాబు పాత్రను సుకుమార్‌ మలిచిన విధానం.. ఆ పాత్రలో చరణ్ నటన అన్నింటిని మరుగున పడేలా చేశాయి. అంటే సినిమాలో కొన్ని మైన‌స్ లు ఉన్నాయి కానీ అయినా వాటిని త‌న న‌ట‌న‌తో చిట్టిబాబు క‌నిపించ‌కుండా చేసాడు అని చెప్ప‌క‌నే చెప్పాడు రాజ‌మౌళి. ముఖ్యంగా చ‌ర‌ణ్ త‌న పాత్రలోని ప్రతీ చిన్న ఎక్స్‌ప్రెషన్ అద్భుతంగా చేసాడు.. అది కన్నుల పండుగగా అనిపించింది. ఇక సినిమాకు మ‌రో హైలైట్ జ‌గ‌ప‌తిబాబు.. ఆయ‌న మెల్ల‌గా చెప్పిన డైలాగులు అద్భుతంగా అనిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్‌.. సుకుమార్‌ ఇతర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసాడు రాజ‌మౌళి. ఇదే సినిమాపై మ‌హేశ్ బాబు కూడా చ‌ర‌ణ్, సుకుమార్ తో పాటు చిత్ర‌యూనిట్ అంద‌రికీ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసాడు. మొత్తానికి రంగ‌స్థ‌ల విడుద‌లై ప‌ది రోజులు కావొస్తున్నా ఇప్ప‌టికీ ప్ర‌శంస‌ల వ‌ర్షం మాత్రం ఆగ‌డం లేదు. 

More Related Stories