English   

రాజ‌మౌళి.. చ‌ర‌ణ్.. చిరంజీవి క్లాస్..

chiru,ram charan and rajmouli

అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. చిరంజీవికి తెలియ‌కుండా రామ్ చ‌ర‌ణ్ ఏ ప‌ని చేయ‌డు. కానీ ఇప్పుడు చేస్తున్నాడు. ఆ మ‌ధ్య సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమా ఒప్పుకున్నపుడు కూడా చిరంజీవి కంటే ఈ చిత్రం విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ ఎక్కువ‌గా ఎగ్జైట్ అయ్యాడు. ఈ చిత్రం ముందు నుంచి చిరుకు పెద్ద‌గా ఆస‌క్తి లేదు. ఇలాంటి సినిమా ఇప్పుడు వ‌ర్క‌వుట్ అవుతుందా అనే భ‌యంలోనే ఉన్నాడు. కానీ చ‌ర‌ణ్ మాత్రం సుకుమార్ పై న‌మ్మ‌కంతో ముందడుగు వేస్తున్నాడు. ఆ త‌ర్వాత ర‌షెస్ చూసి చిరు కూడా ఫ్లాట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు రాజ‌మౌళి సినిమా విష‌యంలోనూ చిరుకు చెప్ప‌కుండానే సినిమా ఓకే చేసాడు చ‌ర‌ణ్. త‌ర్వాత వెళ్లి తండ్రితో మాట్లాడాడ‌ని తెలుస్తుంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ లో ఎన్టీఆర్ తో పోలిస్తే చ‌ర‌ణ్ కు కాస్త త‌క్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలుస్తుంది. 

ఈ వార్త‌ల నేప‌థ్యంలో తండ్రి స‌ల‌హా తీసుకున్నాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై చిరంజీవి కూడా చాలా సంతోషంగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. రాజ‌మౌళి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ వ‌చ్చి అడిగిన‌పుడు కాద‌న‌కూడ‌ద‌ని.. అంతా ఆయ‌నే చూసుకుంటాడ‌ని కొడుకుకు చెప్పిన ట్లుగా వార్త‌లొస్తున్నాయి. పాత్ర త‌క్కువ‌గా ఉన్నా.. అన్నీ ద‌ర్శ‌క‌ధీరుడే చూసుకుంటాడ‌ని చ‌ర‌ణ్ కు చిరు భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అంతే కాదు.. అప్ప‌ట్లో కృష్ణ‌-శోభ‌న్ బాబు లాంటి స్టార్స్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్స్ చేసిన‌పుడు క‌చ్చితంగా ఎవ‌రో ఒక‌రి పాత్ర త‌గ్గినా.. ఇమేజ్ మాత్రం ఇద్ద‌రికీ పెరిగింద‌ని చిరు గుర్తు చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా విష‌యంలో చ‌ర‌ణ్ తీసుకున్న సొంత నిర్ణ‌యం చిరంజీవికి కూడా న‌చ్చేసింది. అందుకే త‌న‌యుడికి త‌న‌కు తోచిన స‌ల‌హాలు ఇస్తున్నాడు మెగాస్టార్. 

More Related Stories