English   

రాజమౌళి మొదలుపెట్టినా ఆమె వల్ల ఇబ్బందేనట 

Rajamouli RRR
2020-07-14 13:36:25

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. తెలుగు నాడు నుండో స్వతంత్రం కోసం పోరాడిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలను కలుపుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఎప్పుడూ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఇప్పటికే 80 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. 

అయితే టాలీవుడ్ లోని అన్ని సినిమాల్లానే ఈ సినిమాకి కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. అయినా ఎలా అయినా ఆర్ఆర్ఆర్ డేట్ అనౌన్స్ చేసిన నాటికి రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఐతే కరోనా వలన విధించిన లాక్ డౌన్ వలన ఇప్పట్లో విదేశాల నుండి వచ్చే ఫ్లైట్స్ తిరిగే పరిస్థితి లేదు. అయితే జక్కన్న ఏమో ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ సహా ముగ్గురు విదేశీ నటులను తీసుకున్నారు. వీరిలో ఒకరు ఎన్టీఆర్ హీరోయిన్ అయిన ఒలీవియా మోరిస్, ఆమె లండన్ కి చెందిన ఆర్టిస్ట్ కాగా ఆమెను ఈ లాక్ డౌన్ సమయంలో ఇండియాకి రావడం అనేది జరగని పని. ఆమె కాక వివిధ భాషలకు చెందిన నటులు ఈ చిత్రంలో భాగమై ఉండగా వారందరినీ ఇప్పుడు అసెంబుల్ చేయడం కూడా సమస్యగా మారింది. 

ఎన్టీఆర్, చరణ్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ముంబై లో ఉన్న అలియా భట్, అజయ్ దేవ్ గణ్ అయినా వచ్చి షూట్ లో పాల్గొంటారని భావించగా ఇప్పుడు అలియా భట్ జక్కన్నకి షాక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అదేంటంటే కరోనా తగ్గేదాకా షూటింగ్ కు రాలేనని అలియా భట్ చెప్పినట్లు సమాచారం. బ్రహ్మాస్త్ర మరియు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అలియా వీటిలో ఏ సినిమా షూటింగ్స్ కి ససేమిరా అంటుందని సమాచారం. దాంతో ఇప్పుడు జక్కన్న ఆమెతో ఎలా డీల్ చేయాలో తెలియక తలపట్టుకున్నారట. జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ చేద్దామని అనుకుంటున్నానో చెప్పినా ఆమె ఒప్పుకోవటం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories