English   

ఆర్ఆర్ఆర్.. ఎన్నెన్ని క‌థ‌లో..!

Rajamouli-RRR
2018-07-18 16:43:08

రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు అంచ‌నాల‌తో పాటు ఆస‌క్తి కూడా ఉంటుంది. ఆయనేం చేస్తున్నాడో.. ఏం చేయ‌బోతున్నాడో.. మ‌ళ్లీ ఈ సారి ఏం అద్భుతం చేస్తాడో అని ఎవ‌రికి వాళ్లు సొంతంగా బుర్ర‌ల‌కు ప‌ని చెబుతుంటారు. ఇక క‌థ విష‌యంలో కూడా రాజ‌మౌళి సినిమాపై చాలా విష‌యాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్ర క‌థ‌పై ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు చెబుతూనే ఉన్నారు. ఒలంపిక్ నేప‌థ్యంలో అని ఓ సారి.. కాదు బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ అని మ‌రోసారి.. ఇలా ఎవ‌రికి వాళ్లు సొంత స్టోరీలు అల్లేస్తున్నారు. ఇక ఇప్పుడు బ్రిటీష్ కాలం నాటి క‌థ‌తో ఇది తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన సెట్ల నిర్మాణం ఆర్ఎఫ్ సీతో పాటు అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతుంది. బ్రిటీష్ కాలాని సంబంధించిన సెట్లు చూసిన త‌ర్వాతే ఇది అక్క‌డి క‌థ అని క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటున్నారు విశ్లేష‌కులు. మ‌రోసారి క‌చ్చితంగా విజువ‌ల్ వండ‌ర్ చేస్తున్నాడు రాజ‌మౌళి. పైగా ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి సూప‌ర్ స్టార్స్ అంటే ఆ క‌థ ఎలా ఉంటుందో ఊహ‌కు కూడా అంద‌డం లేదు. 

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఇంకా మొద‌ల‌వ్వ‌క ముందే క‌ర‌ణ్ జోహార్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కోసం బేరం పెట్టేసాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 180 కోట్లు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చాడు క‌ర‌ణ్. బాహుబ‌లి అంటే విజువ‌ల్ వండ‌ర్ కాబ‌ట్టి ఓకే కానీ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తెలియ‌క‌పోయినా కేవ‌లం రాజ‌మౌళి బ్రాండ్ తో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ కు ఈ రేట్ ప‌ల‌క‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే. అయితే ఈ చిత్ర రైట్స్ ఎంత‌కు ఇవ్వాలి.. ఇవ్వాలా వ‌ద్దా అనేది మాత్రం నిర్మాత దాన‌య్య‌కే వ‌దిలేసాడు రాజ‌మౌళి. ఆయ‌న ఇష్ట‌మైతే ఇవ్వాలి.. లేదంటే లేదు. ఈ చిత్రాన్ని 300 కోట్ల‌తో నిర్మించ‌నున్నాడు దాన‌య్య‌. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. 2020 స‌మ్మ‌ర్ కు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. విడుద‌ల‌వ్వ‌క ముందే ఇన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏం చేస్తుందో..?

More Related Stories