English   

పాక్ లో పాక్ పై రాజ‌మౌళి సంచ‌ల‌నం.. 

Rajamouli-pakisthan
2018-04-04 12:48:38

వాళ్ల దేశానికి వెళ్లి వాళ్ళ‌నే మీరు మా శ‌త్రువులు అనేసాడు రాజ‌మౌళి. ఈ మాట‌లు అన్న‌ది కూడా పాక్ గ‌డ్డ‌పైనే. చిన్న‌ప్ప‌ట్నుంచీ మాకు శ‌త్రువు అంటే పాకిస్థాన్.. మా బిగ్గెస్ట్ విల‌న్ వసీమ్ అక్ర‌మ్ అంటూ చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. ఇదంతా ఆయ‌న పాకిస్థాన్ లో మాట్లాడిన మాట‌లే. తాజాగా ఈయ‌న క‌రాచీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు వెళ్లాడు. మార్చ్ 31 నుంచి ఎప్రిల్ 1 మ‌ధ్య జ‌రిగింది ఈ వేడుక‌. ఇందులో బాహుబ‌లి కూడా ప్ర‌ద‌ర్శిత‌మైంది. దీనికి వెళ్లిన జ‌క్క‌న్న‌.. చాలా ఉత్సాహంగా క‌నిపించారు. ఇందులో ఆయ‌న్ని పాకిస్థాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే శ‌త్రువులు అనే మాట‌ని వాడాడు. ఆ త‌ర్వాత పెద్దయ్యే కొద్ది ఆ అభిప్రాయం మారిందని.. మనమంతా సేమ్ పీపుల్ అని అర్థమైందని చెప్పాడు రాజ‌మౌళి. దానికి అక్క‌డి వాళ్లంతా చ‌ప్ప‌ట్ల‌తో జ‌క్క‌న్న‌ను ఆకాశానికి ఎత్తేసారు. 

సోషల్ మీడియాలో ఇప్పుడు రాజమౌళితో ప‌లువురు పాకిస్థాన్ న‌టీన‌టులు.. సెలెబ్రెటీస్ దిగిన ఫోటోలు సంద‌డి చేస్తున్నాయి. పాక్ లో రాజ‌మౌళి రేంజ్ చూసి అంతా షాక్ అయ్యారు. రాజమౌళి కూడా పాక్ వెళ్ల‌డానికి చాలా ఉత్సాహం చూపించారు. మిగిలిన దేశాలు వెళ్లిన‌పుడు కూడా పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు కానీ పాక్ అన‌గానే జ‌క్క‌న్న‌లో జోష్ వ‌చ్చింది. ఎంతైనా దాయాది దేశం క‌దా.. మ‌న వ‌ర్క్ మెచ్చుకుని మీరు తోపులు అని పిలిచిన‌పుడు ఆ మాత్రం గ‌ర్వం ఉంటుంది. ఇప్పుడు అదే విజ‌య‌గ‌ర్వం రాజ‌మౌళిలో క‌నిపించింది. మొత్తానికి పాక్ లో మ‌న జెండానే ఎగ‌రేసి.. వాళ్ల గడ్డ‌పై వాళ్ల‌నే శత్రువులు అనేసాడు రాజ‌మౌళి. 

More Related Stories