English   

సుబ్బ‌రాజుతో జ‌క్క‌న్న‌.. వాట్ ఏ జోక్..

Rajamouli-To-Direct-Subbaraju-As-Hero
2017-05-03 04:27:23

రాజ‌మౌళి రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకేస్తోంది. ఆయ‌న‌తో క‌నీసం ఒక్క సినిమా అయినా చేయాల‌ని హీరోలంతా క‌ల‌లు కంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు ఈయ‌న త‌ర్వాతి సినిమా ఏంట‌నే విష‌యంపై అంత‌టా ఆస‌క్తి ఉంది. దీనిపై రాజ‌మౌళి కూడా ఏ స‌మాధానం చెప్ప‌డం లేదు. అయితే గాసిప్ రాయుళ్లు మాత్రం రాజ‌మౌళి త‌ర్వాతి సినిమాపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వార్త‌లు సృష్టిస్తున్నారు. మ‌గ‌ధీర స‌మ‌యంలో సునీల్ యాక్ష‌న్ చూసి.. మ‌ర్యాద‌రామ‌న్న చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు.

ఇప్పుడు బాహుబ‌లి 2లో సుబ్బ‌రాజ్ పోషించిన కామెడీ పాత్ర‌కు మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఇదే పాత్ర‌ను వాడుకుంటూ రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లొస్తున్నాయి. ఇందులో సుబ్బ‌రాజే హీరోగా న‌టిస్తాడంటూ వార్త‌లు పుట్టించారు కొంద‌రు. వింటుంటేనే ఇది జోక్ అని తెలిసిపోతుంది. ఒక‌వేళ‌ నిజ‌మే అయితే మాత్రం సుబ్బ‌రాజు జాత‌కం పూర్తిగా మారిపోయిన‌ట్లే..!

More Related Stories