English   

ఎన్టీఆర్ టీజర్ పై ట్రోల్స్..ఈ సీన్ అక్కడిదే

 Rajamouli
2020-10-23 11:45:32

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాను దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే కొంతవరకు సినిమా షూటింగ్ పూర్తి కాగా మధ్యలో వచ్చిన లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. మొదట రాంచరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్ ను చరణ్ బర్త్ డే సంధర్బంగా విడుదల చేసారు. కాగా ఎన్టీఆర్ బెర్త్ డే కి కొమురంభీమ్ పాత్ర టీజర్ ను విడుదల చేయాలని భావించినప్పటికీ అప్పటికి షూటింగ్ ను పూర్తి చేయలేదు. దాంతో ఎన్టీఆర్ టీజర్ విడుదల ఆలస్యం అయింది. 

ఇక నిన్న కొమురంభీమ్ జయంతి సంధర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ టీజర్ ను విడుదల చేసింది. లేటుగా వచ్చినప్పటికీ ఎన్టీఆర్ టీజర్ లేటెస్ట్ గా అందరినీ ఆకర్షించింది. టీజర్ లో ఎన్టీఆర్ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో చరణ్ వాయిస్ తో గూస్ బంప్స్ వచ్చేలా టీజర్ ఉంది. అంతే కాకుండా చరణ్ టీజర్ లో జక్కన్న అగ్నిని చూపించగా...ఎన్టీఆర్ టీజర్ లో నీళ్లను చూపించాడు. టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కొమురంభీమ్ టీజర్ లో అగ్నిపర్వతం బద్దలు అయ్యే సీన్ యూట్యూబ్ నుండి కాపీ చేసినట్టు ఉందట. నేషనల్ జాగ్రఫి ఛానల్ తొమ్మిది నెలల క్రితం యూట్యూబ్ లో పెట్టిన వీడియోలోని సన్నివేశం మరియు టీజర్ లోని సన్నివేశం  ఒకేలా కనిపిస్తుండటంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. జక్కన్న కు టైం లేకపోవడంతోనే ఇలా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్లపై జక్కన్న ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories