English   

రాజమౌళికి హీరోయిన్లు కూడా వాళ్లే కావాలట..!!

rajamouli-01

రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తోందంటే ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. బాహుబలితో వాల్డ్ వైడ్ గా ఇమేస్ స్పాన్ పెంచుకున్న రాజమౌళి బాహుబలి ద కంక్లూషన్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఏకంగా ఓ భారీ మల్టీస్టారర్ అనౌన్స్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా సినిమా చేయబోతున్నాడు. డివివి దానయ్య నిర్మించబోతోన్న ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఈ మూవీకి ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న రాజమౌళి ఇప్పుడు హీరోయిన్ల విషయంలోనూ అవే ‘ఆర్’ లు కావాలంటున్నాడు. అంటే ‘ఆర్’ స్క్వేర్ అన్నమాట. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.. ఇలా ముగ్గురి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను R.R.Rగా పిలుచుకుంటున్నారు.

అయితే ఇప్పుడు  Rలెటర్ తోనే పేర్లు ప్రారంభమయ్యే హీరోయిన్లు కావాలంటున్నాడు జక్కన్న. యస్ అంటే ఈ ఆర్ హీరోలకు ఆర్ భామలే అన్నమాట. మరి అలా చూస్తే ఆర్ అనే లెటర్ తో పేరు మొదలయ్యే భామలు ఎవరున్నారని చూస్తే.. రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఛలో బ్యూటీ రష్మిక మందన్నా మాత్రం ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో రాశిఖన్నా ఆల్రెడీ ఎన్టీఆర్, చరణ్ లతో చేసి ఉంది. రాశిఖన్నా ఎన్టీఆర్ తో మాత్రం జై లవకుశ చేసింది. కానీ రకుల్ ను ఇప్పుడు టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. అంటే రాశిఖన్నా, రష్మిక మందన్నా ఉన్నారు. మరి ఈ ఇద్దరిని తీసుకుంటాడా లేక మరో ఆప్షన్ కు వెళతాడా అనేది తెలియదు కానీ.. మొత్తానికి రాజమౌళి ప్లాన్ కాస్త క్రేజీగా ఉంది కదా.. ఏదేమైనా ఇలా చేస్తే ఆ ప్రాజెక్ట్ కు ‘ఆర్’స్క్వేర్ అనే పేరు మాత్రం వస్తుంది. 

More Related Stories