English   

ర‌జినీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లేనా..? 

rajanikanth-political-entry
2017-04-09 04:30:29

గ‌త ద‌శాబ్ధ కాలంగా త‌మిళనాట ర‌జినీకాంత్ పై ఓ ఒత్తిడి ఉంది. అత‌డ్ని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఎంతోమంది ఎన్నో ర‌కాలుగా ట్రై చేస్తున్నారు. చివ‌రికి న‌రేంద్ర‌మోడీ లాంటి వ్య‌క్తి కూడా సూప‌ర్ స్టార్ ద‌గ్గ‌రికి రాయ‌బారిగా వ‌చ్చాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని.. అటువైపు త‌న అడుగు ప‌డ‌ద‌ని చెప్పుకొచ్చాడు ర‌జినీకాంత్. కానీ ఇప్పుడు త‌మిళ‌నాట ఓ ర‌క‌మైన రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింది. అమ్మ మ‌ర‌ణం.. కుర్చీ కోసం శ‌శిక‌ళ‌, ప‌నీర్ సెల్వం పోరు.. ఇలా ఎటూ దిక్కుతోచ‌ని అనాధ‌లా మారిపోయాయి త‌మిళ రాజ‌కీయాలు. జ‌య‌ల‌లిత ఉన్న‌పుడు త‌మిళ‌నాడు ప‌రిస్థితేంటి అనే ఆలోచ‌న‌లే ఎవ‌రికీ రాలేదు.

అమ్మ‌ వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఒక్క‌సారిగా చాలా శూన్యం క‌నిపిస్తోంది అక్క‌డ‌. ఈ స‌మ‌యంలో ఈ శూన్య‌త‌ను పూడ్చ‌డానికి ఎవ‌రో ఒక బ‌ల‌మైన నాయ‌కుడు రావాలి. ఆ లీడ‌ర్ ర‌జినీకాంత్ ఎందుకు కాకూడ‌ద‌ని ప్ర‌శ్నిస్తున్నారు రాజకీయ విశ్లేష‌కులు. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు మంచిదంటున్నారు వాళ్లు. ఇప్ప‌టికే ర‌జినీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకురావ‌డానికి చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. సాక్షాత్తు బిజేపీ నుంచి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీనే సూప‌ర్ స్టార్ ను ప్ర‌త్యేకంగా క‌లిసారు. త‌మ పార్టీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. కానీ అన్నింటినీ సున్నితంగా తిర‌స్క‌రించారు ర‌జినీ. కానీ అప్పుడున్న ప‌రిస్థితులు వేరు.. ఇప్ప‌టి ప‌రిస్థితులు వేరు. ఇప్పుడు గ‌న‌క సూప‌ర్ స్టార్ కాస్త మ‌న‌సు పెడితే రాజ‌కీయంగా శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.

దీనికి త‌గ్గ‌ట్లే ఫ్యాన్స్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ర‌జినీ. త్వ‌ర‌లోనే ప్రతీ జిల్లాకు వెళ్లి.. అక్క‌డి అభిమానుల‌ను క‌లుసుకోనున్నారు. పైగా త‌మిళ‌నాట ఎప్పుడూ ప‌క్క రాష్ట్రం నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను ఆద‌రించే అల‌వాటుంది. ఎమ్జీఆర్, జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి ఇలా బోలెడంత మంది త‌మిళ వాళ్లు కాదు. ర‌జినీ కూడా మ‌రాఠీ. త‌మిళ‌వాడు కాదు.. ర‌జినీ రాజ‌కీయాల్లోకి రావ‌డాన్ని నేను ఆహ్వానించ‌నంటూ శ‌రత్ కుమార్ చేసిన క‌మెంట్స్ పై అభిమానులు తీవ్రంగా స్పందించారు.

ఎవ‌రెన్ని చెబుతున్నా.. ర‌జినీకాంత్ మాత్రం ఇప్ప‌టికీ పాలిటిక్స్ అంటే పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఒక‌వేళ ఈయ‌న‌కు మ‌న‌సులో రాజకీయాల్లోకి రావాల‌ని ఉన్నా.. కొన్ని ప‌రిస్థితులు ఆయ‌న్ని ఆపేస్తున్నాయి. ఇన్నాళ్ళూ ఎవ‌రెన్ని చెప్పిన రజినీ నో అన్నారు. ఇప్పుడు గానీ తొంద‌ర‌ప‌డి పాలిటిక్స్ లోకి వ‌చ్చారంటే.. అమ్మ‌కు భ‌య‌ప‌డే ఇన్నాళ్లూ సూప‌ర్ స్టార్ దూరంగా ఉన్నాడ‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఇదే జ‌రిగితే ర‌జినీ ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్ జ‌రిగిపోయిన‌ట్లే. ఇవ‌న్నీ ఆలోచించి సూప‌ర్ స్టార్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నాడు. అమ్మ లోటు ఎవ‌రూ పూడ్చ‌లేర‌ని.. త‌న లాంటి వాళ్ల‌కు రాజ‌కీయాలు సూట్ అవ్వవ‌ని విన‌మ్రంగా చెబుతున్నాడు రజినీకాంత్. మ‌రి చూడాలిక‌.. సూప‌ర్ స్టార్ మ‌న‌సు మార్చి.. ఆయ‌న్ని పాలిటిక్స్ లోకి తీసుకొచ్చే వాళ్లు ఎవ‌రైనా ఉన్నారేమో..?

More Related Stories