English   

చిరుతో రాజ‌శేఖ‌ర్ కు ఇంకా తెగ‌లేదా..? 

Rajasekhar

అదేంటి.. ఈ మ‌ధ్యే క‌దా.. చిరంజీవితో క‌లిసిపోయాం.. ఇప్పుడు మా మ‌ధ్య ఏ గొడ‌వ‌లు లేవు.. గ‌రుడ‌వేగ స‌క్సెస్ కు చిరంజీవి కూడా ఓ కార‌ణ‌మే అంటూ ఆయ‌న్ని ఆకాశానికి ఎత్తేసాడు రాజ‌శేఖ‌ర్. అంత‌లోనే మ‌ళ్లీ గొడ‌వేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్తే ఇది. ఈ సీనియ‌ర్ హీరో ఇప్పుడు చిరంజీవి పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. అది కూడా ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ లో. అవును.. ఉద‌య్ కిర‌ణ్ అంటే క‌చ్చితంగా అందులో చిరంజీవి పాత్ర కూడా కీల‌కమే. ఎందుకంటే ఈ హీరో జీవితం త‌ల‌కిందులు అయిపోవ‌డానికి కార‌ణం మెగాస్టార్ అండ్ ఫ్యామిలీ అనే వార్త‌లు అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో బాగానే వినిపించాయి. చిరంజీవి పెద్ద‌కూతురు సుష్మిత‌తో ఉద‌య్ కి నిశ్చితార్థం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఏవో కార‌ణాల‌తో పెళ్లి ఆగిపోయింది. దాంతో పాటే ఉద‌య్ కెరీర్ కూడా అక్క‌డే ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప‌దేళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చి.. 2014లో ఈ హీరో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

ఇప్పుడు ఈయ‌న బ‌యోపిక్ ను కాబోయే అల్లుడు అనే టైటిల్ తో తేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో చిరంజీవిగా రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇదే జ‌రిగితే కావాల‌నే చిరుతో మ‌ళ్లీ రాజ‌శేఖ‌ర్ పెట్టుకుంటున్న‌ట్లే..! ఉద‌య్ బ‌యోపిక్ లో క‌చ్చితంగా చిరు అండ్ ఫ్యామిలీనే విల‌న్ గా చూపించాలి. అయితే అప్పుడేం జ‌రిగిందో వాస్త‌వం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ పెళ్లి ఆగిపోవ‌డంలో చిరంజీవి కుటుంబం పాత్ర ఎంతుందో ఉద‌య్ పాత్ర కూడా అంతే ఉంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ పెద్ద‌స్థాయిలో ఉంది చిరంజీవి కాబ‌ట్టి త‌ప్పంతా ఆయ‌న‌పైకే వెళ్లింది. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ జీవితం కూడా ముగిసిపోయింది. ఇప్పుడు కానీ ఆయ‌న బ‌యోపిక్ వస్తే కావాల‌నే తేజ మ‌ళ్లీ స‌మ‌సిపోయిన స‌మ‌స్య‌ను పైకి తీసుకొచ్చిన‌ట్లే..! చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో.. చిరంజీవిగా రాజ‌శేఖ‌ర్ ఏం చేయ‌బోతున్నాడో..? 

More Related Stories