English   

విషమంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

Rajasekhar health
2020-10-22 11:37:31

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికి వైరస్ ఎఫెక్ట్ మాత్రం తగ్గడంలేదు. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన పడి కోలుకున్నారు. మరికొంతమంది కరోనాతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ హీరో రాజశేఖర్ తో పాటు ఆయన సతీమణి, నటి జీవిత మరియు వారి ఇద్దరు కుతుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా కూతుళ్లు శివాత్మిక, శివాని కరోనా నుండి కొలుకున్నారు. జీవితా రాజశేఖర్ మాత్రం ఇంకా మహమ్మరితో పోరాడుతూనే ఉన్నారు. 

తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. నాన్న త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరింది. శివాత్మిక ట్వీట్ లో " కరోనా తో నాన్న పోరాటం కష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన గట్టిగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు ప్రేమాభిమానాలు మమ్మల్ని రక్షిస్తాయని నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ ప్రార్థించాలని మేము కోరుతున్నాము. మీ అభిమానం, ప్రేమతో మా కోలుకుని వస్తాడు" అంటూ శివాత్మిక పేర్కొంది.

More Related Stories