English   

రాజశేఖర్ ను వదలేలా లేడు

Rajasekhar-Ram
2018-04-30 17:05:33

యాంగ్రీయంగ్ మేన్ గా గుర్తింపు తెచ్చుకుని మధ్యలో కెరీర్ ఢీలా పడేసుకున్న రాజశేఖర్ కు మళ్లీ గరుడవేగతో లైఫ్ వచ్చింది. సినిమా సూపర్ గా ఉన్నా కలెక్షన్స్ లో కాస్త వీక్ గా ఉండటానికి కారణం ఇప్పుడు రాజశేఖర్ కు మార్కెట్ లేకపోవడమే. అయితే ఈ మూవీతో రాజశేఖర్ ను బలంగా నమ్మిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అందరూ వద్దన్నా తన కథకు అతనే కరెక్ట్ అని మొండిగా వెళ్లి మరీ సక్సెస్ అయ్యాడీ దర్శకుడు. ఈ విషయంలో రాజశేఖర్ కూ తనపై తనకు నమ్మకం లేదు. అయితేనేం.. దర్శకుడిని ఫాలో అయ్యాడు. హిట్ కొట్టాడు. కట్ చేస్తే ఇప్పుడీ దర్శకుడు రాజశేఖర్ ను వదలనంటున్నాడు. 

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు స్రవంతి మూవీస్ బ్యానర్ లో రామ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రాజశేఖర్ కు ఓ బలమైన పాత్ర ఇచ్చినట్టు టాక్. అది కూడా విలన్ రోల్ అంటున్నారు. నిజానికి రాజశేఖర్ చాన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేక విలన్ గానో మారాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో కుదర్లేదు. ప్రవీణ్ సత్తారు పుణ్యమా అని ఫేడవుట్ అవుతోన్న దశలో సడెన్ గా హీరోగా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు రాజశేఖర్ పాత కోరికను కూడా కొత్త పాత్ర ఇచ్చి ప్రవీణే తీర్చబోతున్నట్టు చెబుతున్నారు. అతను ఇన్నాళ్లుగా ఎదురుచూస్తోన్న పాత్ర తనే ఇచ్చాడట. రామ్ సినిమాలో రాజశేఖర్ పాత్ర కూడా చాలా కీలకం అంటున్నాడు. ప్రవీణ్ హీరోల కంటే తన కథలనే ఎక్కువగా నమ్ముతాడు. కాబట్టి ప్రవీణ్ ఐడియాకు రామ్ కూడా(అతనూ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి)నో చెప్పే పరిస్థితి లేదు.  

మొత్తంగా గరుడవేగ తర్వాత రాజశేఖర్ దశ తిరిగినట్టే అనిపిస్తోంది. రీసెంట్ గా అఁ సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ కూడా రాజశేఖర్ హీరోగా మరో సినిమాచేయబోతున్నట్టు టాక్. అటు మరో తమిళ దర్శకుడు కూడా రాజశేఖర్ అప్రోచ్ అవుతున్నాడు. మరి ఇవన్నీ చూస్తే అతని దశ తిరిగినట్టే కదా. అయితే హీరోగా ఎన్నాళ్లో రాణించలేడు కాబట్టి.. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు, రామ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాయే రాజశేఖర్ కెరీర్ కు కొత్త టర్న్ ఇస్తుందనేది నిజం. ఏదేమైనా రాజశేఖర్ లో ప్రవీణ్ కు ఏం నచ్చిందో కానీ అతన్ని వదిలేలా లేడు.

More Related Stories