English   

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల

 Rajasekhar
2020-10-28 10:49:37

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. రాజశేఖర్ తో పాటు జీవిత మరియు వారి ఇద్దరు కుతుళ్లకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు కరోనా ను జయించారు. కానీ జీవితా, రాజశేఖర్ ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్నారు. కాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో రాజశేఖర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. 

మంగళవారం కూడా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. బులిటెన్ లో రాజశేఖర్ ఆరోగ్యం మెల్లిమెల్లిగా కుదుట పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన కు ఐసియులో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. చికిత్సకు ఆయాన ఆరోగ్యం సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు నాన్ ఇన్వాసిన్ వెంటిలేటర్ తొలగించామన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా ఆయనకు చికిత్స చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక జీవిత కూడా కరోనా నుండి కొలుకున్నట్టు తెలుస్తోంది.

More Related Stories