English   

రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’సినిమా కాస్టింగ్ భలే ఉందే..?

Rajasekhar-Reddy
2018-03-27 13:09:41

తెలుగులో బయోపిక్స్ తక్కువ. వచ్చినవాటిలో ఆకట్టుకున్నవీ తక్కువే. అయితే లేటెస్ట్ గా అవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓ రాజకీయనాయకుడి జీవితం వెండితెరపై గాథగా రావడం తెలుగులో ఇప్పటి వకరూ ఒకటీ అరా(అది కూడా రాజశేఖర్ రెడ్డి జీవితకథతోనే ఓసినిమా వచ్చింది)మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిన ఈ సినిమాను ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి ‘యాత్ర’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఆల్రెడీ ఆర్టిస్టుల సెలెక్షన్ కూడా మొదలైంది. అయితే ప్రధాన పాత్రలకు సంబంధించిన నటుల పేర్లే సంచలనంగా మారాయిప్పుడు.

రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాల మెగాస్టార్ మమ్మూట్టిని ఒప్పించాడు దర్శకుడు. ఈ విషయంలో చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకంటే ఆశ్చర్యపరిచే విషయాలు రివీల్ చేస్తున్నాడీ దర్శకుడు. వైఎస్. జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో అబద్ధం అనుకోవడానికీ ఏమీ లేదు. ఆ మధ్య తన గ్యాంగ్ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో తనకు జగన్ అంటే ఇష్టం అన్నాడు సూర్య. దీంతో అతనీ పాత్ర చేసినా ఆశ్చర్యం లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి భార్య భారతి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ తీసుకున్నాడు దర్శకుడు. భారతికి కాస్త దగ్గర పోలికలు కూడా ఉండే శరణ్యను తీసుకోవాలనుకుంటున్నారు. రఘువరణ్ బిటెక్ వంటి సినిమాలతో శరణ్య తెలుగువారికీ బాగా పరిచయమే. వీటన్నిటికంటే సెన్షేషనల్ న్యూస్ ఏంటంటే.. షర్మిల పాత్ర కోసం కీర్తి సురేష్ ను తీసుకోబోతున్నారనే రూమర్.. యస్ షర్మిల పాత్రలో కీర్తి సురేష్ అయితే ఎలా ఉంటుందా అని ఈ మూవీ టీమ్ ఆలోచిస్తోందట. ఒకవేళ కీర్తి సురేష్ ఈ పాత్ర చేస్తే తన కెరీర్ ఆ తర్వాత ఏమౌతుందో వేరే చెప్పక్కర్లేదు. ఏదేమైనా ఈ యాత్ర మూవీకి సంబంధించిన వినిపిస్తోన్న వార్తలు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పై అటెన్షన్ పెంచుతాయనేది నిజం.  

More Related Stories