English   

ఈ యాత్ర చ‌రిత్ర‌లో నిలుస్తుందా..?

YSR-Biopic
2018-04-07 14:57:58

యాత్ర‌.. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ గా వ‌స్తోన్న సినిమా. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ళ‌యాల మెగాస్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నాడు. ఈ పాత్ర‌కు ఆయ‌న ఒప్పుకోవ‌డ‌మే సినిమా స‌క్సెస్ కు ఫ‌స్ట్ స్టెప్ గా చెబుతోంది టాలీవుడ్. గ‌తేడాది ఆనందో బ్ర‌హ్మ అనే హార‌ర్ కామెడీతో ఆక‌ట్టుకున్న మ‌హి వి రాఘ‌వ యాత్ర‌కు ద‌ర్శ‌కుడు. అంత‌కు ముందు ఇత‌ను పాఠ‌శాల అనే సినిమా మాత్ర‌మే చేసి ఉన్నాడు. విజ‌య్      చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.  ర‌ఘువ‌ర‌ణ్ బిటెక్ సినిమాలో ధ‌నుష్ మ‌ద‌ర్ గా న‌టించిన‌ శ‌ర‌ణ్య వైఎస్ భార్య పాత్ర‌లో న‌టించ‌బోతోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో త‌మిళ స్టార్ సూర్య న‌టిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరితో పాటు ఇత‌ర పాత్ర‌ల్లోనూ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టుల‌నే తీసుకోబోతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అనుకున్న యాత్ర‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. 

ఈ నెల 9న యాత్ర అఫీషియ‌ల్ గా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ ను కూడా విడుద‌ల చేసి మ‌రీ విష‌యం చెప్పారు. ఒక పాద ముద్ర ను పోస్ట‌ర్ లో ఉంచారు. అంటే రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ జీవితంతో పాద‌యాత్ర అత్యంత కీల‌క ఘ‌ట్టం. ఆ విష‌యాన్నే క‌న్వే చేస్తూ ఈ యాత్ర ఫ‌స్ట్ లుక్ కు శ్రీకారం చుట్టారు. ఇక యాత్ర టైటిల్ కింద .. క‌డ‌ప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌కూ వ‌స్తున్నాను. మీతో క‌లిసి న‌డ‌వాల‌నుంది.. ప్ర‌తి గుండె చ‌ప్పుడు వినాలునుంది అనే కొటేష‌న్ ఉంది. అలాగే పైన ఇంగ్లీష్ లో త‌ను చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ అడుగు స్రుస్టించాల‌నుకున్నాడు.. బ‌దులుగా అది ప్ర‌తి హ్రుద‌యంలో కొలువైంది.. అనే అర్థం వ‌చ్చే మ‌రో కొటేష‌న్ ఉంది. మొత్తంగా ఈ యాత్ర‌తో ద‌ర్శ‌కుడిగానూ త‌న‌కంటూ ఓ కొత్త యాత్ర‌కు శ్రీకారం చుట్టుకోబోతున్నాడు రాఘ‌వ‌.     

More Related Stories