రాజశేఖర్ ఎమోషనల్ పోస్ట్..శేఖర్ ఫస్ట్ లుక్

కరోనా బారిన పడి, తీవ్ర అనారోగ్యానికి గురయ్యా కోలుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ షేర్ చేశారు.'శేఖర్' పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుందని పేర్కొంటూ తెల్ల గెడ్డంతో రఫ్‌లుక్‌లో ఉన్న రాజశేఖర్ ఫొటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. శేఖర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన రాజశేఖర్ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు.
నన్ను ప్రేమించే వాళ్ళందరకి, నేను ప్రేమించే నా అభిమానులకి .. అతి భయంకరమైన కోవిడ్ 19, నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా, మీ ప్రేమ, అభిమానం, నిరంతర ప్రార్ధనలతో, నన్ను మళ్ళీ ఈ నా పుట్టిన రోజు నాడు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్ళైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటాను అని రాజశేఖర్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.