English   

రాజమౌళి, రాజశేఖర్ సమ్ థింగ్ స్పెషల్..?

Rajasekhar-rajamouli

రాజశేఖర్ దశ తిరగబోతోందా.. ఈ యాంగ్రీ యంగ్ మేన్ కెరీర్ బిగ్గెస్ట్ టర్న్ తీసుకున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ పై రాజమౌళి కన్ను పడింది. మరి రాజమౌళి కన్ను పడితే మనోడి కెరీర్ మామూలుగా ఉంటుందా..? యస్.. రాజమౌళి నుంచి రాజశేఖర్ కు పిలుపొచ్చింది. అది కూడా అతను చేయబోతోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం. యస్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించే సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా తీసుబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమౌళి, రాజశేఖర్ కు కథ వినిపించాడని కూడా చెబుతున్నారు. చాలాకాలంగా మంచి పాత్ర వస్తే విలన్ గా మారడానికీ రెడీ అంటోన్న రాజశేఖర్ కు ఇది అనుకోని అవకాశం. ఇలాంటి అవకాశం అతను వదులుకుంటాడు అనుకోలేం. 

నిజానికి రాజశేఖర్ కు గతంలో చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లోనే విలన్ గా చాన్స్ వచ్చింది. అప్పుడు కుదరలేదు. కానీ ఈ సారి చాన్స్ మిస్ చేసుకుంటాడనుకోలేం. కెరీర్ ఆరంభంలో రాజశేఖర్ కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చాలా చేశాడు. యాంగ్రీ యంగ్ మేన్ గా అతనికి గుర్తింపు రావడానికి కారణం అతను పలికించే రౌద్రమే. ఈ రౌద్రం విలనీకి అద్భుతంగా సెట్ అవుతుంది. రాజశేఖర్ సినిమాల్లో విలన్ గా నటించిన చాలామంది ఆర్టిస్టులు మోస్ట్ వాంటెడ్ గా మారారు. వాళ్లందరికీ స్టార్ విలన్ స్టేటస్ కూడా వచ్చేసింది. వాళ్లంతా తెలుగువారికి అప్పటి వరకూ పెద్దగా పరిచయం కూడా లేరు. కానీ రాజశేఖర్ ఈ టర్న్ తీసుకుంటే ఇప్పటి వరకూ హీరోల నుంచి విలన్స్ గా మారిన చాలామందికి షాకింగ్ న్యూస్ అవుతుంది. ఎలా చూసినా వాళ్లందరికంటే రాజశేఖర్ బెస్ట్ చాయిస్.. 

ఒకవేళ రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే ఇప్పటి వరకూ త్రిపుల్ ఆర్ గా ఉన్న ప్రాజెక్ట్ కు మరో ఆర్ చేరుతుంది. ఆర్ ఫర్ రాజమౌళి, ఆర్ ఫర్ రామారావు, ఆర్ ఫర్ రామ్ చరణ్ ఇప్పుడీ యాంగ్రీమేన్ కూడా ఒప్పుకుంటే మరో  ఆర్ ఫర్ రాజశేఖర్ అవుతుంది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ‘‘ఆర్.ఆర్.ఆర్.ఆర్’’గా పిలవాల్సి ఉంటుందేమో.. 

More Related Stories