English   

రాజశేఖర్ కూతురు తెలుగు దాటుతోంది.. 

shivani
2018-07-08 20:48:40

యాంగ్రీ యంగ్ మేన్ గా ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన నటుడు రాజశేఖర్. ఒక దశాబ్ధానికి పైగా వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడ్డ రాజశేఖర్ లాస్ట్ ఇయర్ గరుడవేగతో ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో ప్రధానమైనది హీరోలు తమ వారసులైన అమ్మాయిలను పరిశ్రమలో పంపించడం. నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే హీరోయిన్ అయింది. ఇప్పుడు రాజశేఖర్ కూతురు శివాని కూడా హీరోయిన్ అయింది.  తెలుగులో ‘టూ స్టేట్స్’అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒక రకంగా హీరోయిన్ కావడానికి అన్ని అర్హతలు సంపాదించుకునే అమ్మడు రంగంలోకి దిగింది. ఇక ఆమె తల్లి జీవిత కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాబట్టి శివానికి ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా ఉండవు. అయితే రాజశేఖర్ దంపతులు ఊహించినట్టుగా శివానికి పెద్ద ఆఫర్స్ రావడం లేదు. ఆమె మకాం కోలీవుడ్ నుంచి మాలీవుడ్ కు మారుస్తున్నట్టుగా టాక్స్ వస్తున్నాయి. రావడమేంటీ.. ఆల్రెడీ కోలీవుడ్ లో ఓ సినిమా కమిట్ అయింది.

అక్కడ డస్కీ బ్యూటీస్ కు చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి శివాని కాస్త మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా కోలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుంది. విష్ణు విశాల్ అనే అప్ కమింగ్ హీరోతో శివానీ తమిళ సినిమా చేయబోతోంది. ఈ మధ్య మీడియాలో బాగా హైలెట్ అయిన జల్లికట్టు నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. అంటే ఖచ్చితంగా గ్రామీణ నేపథ్యమే.. మరోవైపు మళయాలంలో ఓ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్.. చాలా యేళ్ల క్రితమే హీరోగా మారిన ఈ కుర్రాడికి కూడా లాస్ట్ ఇయరే ఫస్ట్అండ్ బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. ఇప్పుడు ప్రణవ్ తో కలిసి శివానీ ఓ సినిమా చేయబోతోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే ఖచ్చితంగా శివానీ రేంజ్ మారుతుంది. ఎందుకంటే మోహన్ లాల్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. ఆయన తనయుడుకీ అదే రేంజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఓ పెద్ద సినిమాతోనే శివానీ మాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనుకోవచ్చు. కాకపోతే ఈ మళయాలం వార్త ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు. 

More Related Stories