రాజ్ దూత్ రివ్యూ

రియల్ స్టార్ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రాజ్ దూత్. అర్జున్, కార్తీక్ అనే దర్శక త్రయం దర్శకులుగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని సత్తిబాబు నిర్మించారు. మేఘాంశ్ సరసన నక్షత్ర, ప్రియాంక సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రాజ్ దూత్ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ:
సంజయ్ (మేఘాంశ్) ప్రియ (నక్షత్ర) ను చూసి ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాక ఆమె తండ్రి అయిన అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని తిరుగుతుంటాడు. నీ పట్టుదల నచ్చింది కానీ ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని అడుగుతాడు అనీష్. ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారని అడిగితే, తన తండ్రి కోమాలో ఉన్నాడని, ఆపరేషన్ చేస్తే మామూలు మనిషివుతాడు కానీ కోమాలోంచి బయటపడ్డాక ఆయకు ఇష్టమైంది కళ్లముందు ఉంచాలని చెబుతాడు. తను చెప్పింది తెచ్చిస్తే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తాడు. ప్రియ తండ్రి సంజయ్ ను తెచ్చిమ్మంది ఏమిటి ? సంజయ్ దానిని తెచ్చాడా ? చివరకు సంజయ్, ప్రియ ఒక్కటి అయ్యారా ? అనేది తెలియాలంటే రాజ్ దూత్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ దర్శక త్రయం తీసుకున్న లైన్ బాగున్నా దానిని ప్రెజెంట్ చేసే సమయంలో తడబడ్డారు. రెగ్యలర్ కధనంతో కథని నడిపించారు. ఈ లైన్ తో చాలా సెన్సిబుల్ గా, ఇంటరెస్టింగ్ గా బండి నడిపించవచ్చు కానీ వేరు ఆ పని చేయలేదు. చాలా చోట్ల కధను ఎమోషనల్ గా చూపే అవకాశం వచ్చినా దానిని వాడుకోలేక పోయారు. ఇక ప్రీ క్లైమాక్స్ లో కొంత సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఇక మేఘాంశ్ బద్దకస్తుడుగా, బలాదూర్ గా తిరిగే కుర్రాడుగా సంజయ్ పాత్రలో ఎనర్జీతో నటించాడు. తనకి తొలి సినిమా అయినా ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ రాకుండా ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్ట్ లా ఎంతో ఈజ్ తో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్ఛాడు. హీరోగా నిలబడే అవాకాశాలు కుర్రాడిలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే కీర్తి సురేష్ జిరాక్స్ లా ఉన్న హీరోయిన్ నక్షత్ర పాత్ర కొంచెమే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇక కమెడియన్ గుండు సుదర్శన్ తన తనదైన శైలిలో నవ్వించాడు. రాజన్నగా ఆదిత్య మీనన్, హీరోయిన్ తండ్రిగా అనీష్ కురువిల్లా, రవివర్మ, ఏడిద శ్రీరామ్ లాంటి వారు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. కానీ సీనియర్ నటుడు మనోబాల ట్రాక్ మాత్రం బోర్ కొట్టించింది.
ఫైనల్ గా : రాజ్ దూత్ మేఘాంశ్ కి పర్ఫెక్ట్ లాంచ్...కానీ కధే దెబ్బెసింది.
రేటింగ్ : 1.5 /5.