English   

ఒక్క ప్రోమోతో అనుమానాలన్నీ ఫసక్.. సుమ loves రాజీవ్..

rajeev kanakala
2020-09-08 09:16:54

యాంకర్ సుమ కనకాల విడాకులు తీసుకుంది అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తన భర్త రాజీవ్ కనకాలతో కాకుండా విడిగా ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎప్పుడు పెద్దగా స్పందించలేదు సుమ. మరోవైపు రాజీవ్ కూడా ఈ విషయంపై ఎక్కడ మాట్లాడలేదు. దాంతో ఇద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నారు అని అందరూ నమ్మేసారు కూడా. కానీ ఇదంతా ఉత్తిదే.. అలాంటిది ఏమీ లేదు అని ఒకే ఒక్క ప్రోమోతో నిరూపించారు సుమ, రాజీవ్ కనకాల. క్యాష్ వచ్చేవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో రాజీవ్ కనకాల కంటెస్టెంట్ గా వచ్చాడు. అతనితో పాటు నటులు సమీర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర కూడా ఉన్నారు. అయితే ఈ ప్రోమో మొత్తంలో సుమ రాజీవ్ కనకాల మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయింది. 

ఇద్దరూ తమ రొమాన్స్ తో ప్రేక్షకులను మైమరిపించారు. వీళ్ల మధ్య ఎంత చక్కటి దాంపత్య జీవితం జరుగుతుంది అనేది ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. తమపై వచ్చిన విడాకుల విమర్శలకు ఈ ఒక్క ప్రోమోతో సమాధానమిచ్చారు సుమ రాజీవ్ కనకాల. ఇప్పటికీ ఎప్పటికీ తాము అన్యోన్యంగా ఉంటామని.. లేనిపోనివి కల్పించి పచ్చని కాపురంలో నిప్పులు పోయకండి అంటూ ఈ ఎపిసోడ్ తో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది సుమ. ఏదేమైనా కూడా ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు అనేది మాత్రం కొత్త ప్రోమోతో అందరికీ రుజువు అయిపోయింది. 

More Related Stories