English   

2.0 అనుకున్న‌దే.. ఇక ఆశ‌ల్లేవు..

rajini and akshay kumar 2.0

ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న వార్త‌లే.. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్నాయి. 2.0 ఊహించిన‌ట్లే ఈ ఏడాది కూడా రావ‌డం క‌ష్టంగా మారింది. కొంత కాలంగా 2.0 విడుద‌ల తేదీపై కావాల్సినంత క‌న్ఫ్యూజ‌న్ న‌డుస్తుంది. దీనిపై ఇటు ర‌జినీ కానీ.. అటు శంక‌ర్ కానీ.. మ‌రోవైపు లైకా సంస్థ కానీ ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. ఇప్పుడు అప్పుడు అంటున్నారే.. ఆ అప్పుడు ఎప్పుడో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. ఎప్రిల్ 27న రావ‌ట్లేద‌ని చాలా రోజుల కిందే కన్ఫ‌ర్మ్ చేసారు. అంత‌కంటే ముందే అంటే ఎప్రిల్ 14నే.. త‌మిళ కొత్త సంవ‌త్స‌రాది కానుక‌గా 2.0 విడుద‌ల కానుంద‌ని చెప్పాడు ర‌జినీకాంత్. కానీ అది కూడా జ‌ర‌గ‌డం లేదు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జ‌రుగుతున్నాయి. విఎఫ్ఎక్స్ కంపెనీ చేతులెత్తేయ‌డంతో 2.0 ప‌నులు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చాయి.

మార్చ్ లో ట్రైల‌ర్.. ఎప్రిల్ లో సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ పాడైపోయాయి. ఈ సినిమా ఆగ‌స్ట్ లో విడుద‌ల అవుతుంద‌నుకున్నా.. ఇప్పుడు అది కూడా జ‌రిగేలా క‌నిపించ‌ట్లేదు. దివాళి కానుక‌గా అనుకుంటున్నారు కానీ అప్ప‌టి వ‌ర‌కు సినిమా కూడా గ్రాఫిక్స్ పూర్త‌వుతుంద‌ని ధీమాగా చెప్ప‌లేక‌పోతున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. దాంతో ఈ ఏడాది 2.0 వ‌స్తుందా రాదా అనే మ‌రో క‌న్ఫ్యూజ‌న్ ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో మొద‌లైంది. ప‌రిస్థితులు చూస్తుంటే 2.0 2019కి వెళ్లిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే 2018లో రెండు సినిమాల‌తో రావాల‌నుకున్న ర‌జినీ క‌ల‌కు బ్రేకులు ప‌డ్డ‌ట్లే. మొత్తానికి చూడాలిక‌.. ఈ క‌న్ఫ్యూజ‌న్ కు తెర ప‌డేది ఎప్పుడో..?

More Related Stories