English   

కాలా.. అదిరిపోలా..?

kaala

సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా టీజర్ వచ్చేసింది. నిన్ననే విడుదల కావాల్సిన ఈ టీజర్ శ్రీదేవి మరణంతో ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తామని చెప్పాడు నిర్మాత ధనుష్. కానీ ధనుష్ కు షాక్ ఇస్తూ రాత్రే టీజర్ నెట్లో కనిపించింది. దీంతో షాక్ తిన్న ఎంటైర్ టీమ్.. హడావిడీగా ఉదయమే రిలీజ్ చేసింది. కాస్త ఆలస్యంగా తెలుగు వెర్షన్ టీజర్ విడుదల చేశారు. టీజర్ ఎక్స్ పెక్టెడ్ గానే ఉంది. మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. కబాలితో అంచనాలు పీక్స్ లో పెంచిన రంజిత్ ఈ సారి ఆ తప్పు చేయలేదు. కేవలం మాఫియా బ్యాక్ డ్రాప్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా టీజర్ లో చూపించాడు. ఏజ్ బార్ అవుతోన్న రజినీ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు కిక్కెక్కించేలా ఉంది.  క్యారే సెట్టింగా అంటూ రజినీ చెప్పిన డైలాగ్స్ కేకే. ఇక సినిమాలో విలన్ గా నానాపటేకర్ కనిపిస్తున్నాడు. టీజర్ నానాతోనే స్టార్ట్ అయింది. ది బెస్ట్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న నానా పటేకర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ అనుకోవచ్చు.

ఇక హీరోయిన్ హుమా ఖురేషీ అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం నిన్నటి తరం హీరోయిన్ ఈశ్వరిరావు రజినీకి జోడీగా కనిపిస్తోంది. ఈశ్వరిరావుకు అప్పట్లో కూడా హీరోయిన్ గా పెద్ద పేరు రాలేదు. కానీ బాపు బొమ్మగా రాంబంటు అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. ఇక ఇతర పాత్రలు పెద్దగా ఎలివేట్ చేయలేదు కానీ. ఇదో స్లమ్ పీపుల్ స్టోరీ అనేది తెలిస్తోంది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో కనిపిస్తోంది. మొత్తంగా దర్శకుడు పా. రంజిత్ కబాలి మిస్టేక్ ను చేయలేదు. అది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే చూస్తోంటే.. కబాలితో నిరాశపరిచిన ఈ దర్శకుడు ఈ సారి రెట్టించిన వేగంతో వస్తున్నట్టు కనిపిస్తోంది.. ఏదేమైనా కాలా టీజర్ మాత్రం అద్దిరిపోయింది. 
 

More Related Stories