English   

2.0 వీకెండ్ క‌లెక్ష‌న్స్ 400 కోట్లా.. ఏంట‌మ్మా ఆ క‌హానీ..? 

Rajinikanth-2.o
2018-12-04 09:01:43

ఇప్పుడు ఆ పోస్ట‌ర్ చూసిన వాళ్లంతా ఇదే అడుగుతున్నారు. అస‌లు నాలుగు రోజుల్లో 400 కోట్లు రావ‌డం ఏంటి.. ఓ వైపు సినిమాకు అనుకున్న స్థాయిలో క‌లెక్ష‌న్లు రావ‌డం లేద‌ని బ‌య్య‌ర్లు త‌ల ప‌ట్టుకుంటే మ‌రోవైపు త‌మ సినిమా 4 రోజుల్లోనే 400 కోట్లు వ‌సూలు చేసింద‌ని నిర్మాత‌లు ఇలా పోస్ట‌ర్లు విడుద‌ల చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటున్నారు అభిమానులు కూడా. లేక‌పోతే మ‌రేంటి.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో 150 కోట్ల షేర్ కూడా రాలేదు 2.0కు. ఇది ట్రేడ్ చెబుతున్న మాట‌.. కానీ నిర్మాత‌లు మాత్రం కాదు మా సినిమాకు 400 కోట్లు గ్రాస్ వ‌చ్చిందంటున్నారు. హిస్ట‌రీ మ‌ళ్లీ ర‌జినీకాంత్ తిర‌గ‌రాసాడ‌ని చెబుతున్నారు. 

మ‌రి ఇందులో ఏది నిజం..? ఒక‌వేళ నిర్మాత‌లు చెప్పిన‌ట్లుగానే 400 కోట్లు వ‌స్తే షేర్ క‌చ్చితంగా 250 కోట్లు ఉండాలి. మ‌రి అంత వ‌చ్చిందా అంటే స‌మాధానం శూన్యం. విడుద‌ల‌కు ముందు 2.0 దూకుడు చూసి ఈజీగా బాహుబ‌లి 2 రికార్డులు బ‌ద్ద‌లైపోతాయేమో అనుకున్నారు కానీ ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా బాహుబ‌లి 2 రికార్డులు మార్చలేక‌పోయాడు ర‌జినీకాంత్. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా కూడా కొత్త రికార్డులు నెల‌కొల్ప‌లేదు 2.0. మ‌రిలాంటి సినిమా నాలుగు రోజుల్లోనే 400 కోట్లు ఎలా వ‌సూలు చేసింది..?

మ‌న తెలుగులోనూ 2.0 వ‌సూళ్లు బాగానే ఉన్నాయి కానీ ఊహించిన స్థాయిలో మాత్రం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ 35 కోట్లు షేర్ వ‌చ్చింది. కంటెంట్ లేక‌పోతే ర‌జినీ సినిమాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు ప్రేక్ష‌కులు. ఇప్పుడు కూడా 2.0లో క‌థ లేకుండా కేవ‌లం విజువ‌ల్స్ మాత్ర‌మే ఉన్నాయి. దాంతో లాంగ్ ర‌న్ క‌ష్ట‌మ‌వుతుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఓపెనింగ్స్ వ‌ర‌కు అయితే ప‌ర్లేదు కానీ ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి అనేది అర్థం కావ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమా రికార్డులు ఎక్క‌డ ఆగ‌నున్నాయో..? 

More Related Stories