English   

ర‌జినీకాంత్ ను టార్చ‌ర్ చేస్తున్న‌దెవ‌రు..?

rajinikanth-teaser
2018-03-05 07:44:17

మీరు చ‌దివింది క‌రెక్టే.. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ను టార్చ‌ర్ చేస్తున్నారు. ఆ లీకు వీరులు ఎవ‌రో కానీ ర‌జినీ సినిమాల్నే టార్గెట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న రజినీకాంత్ కాలా టీజ‌ర్ ఇలా పైర‌సీ బారిన ప‌డింది. కాలా టీజ‌ర్ మార్చి 1న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ శ్రీదేవి మ‌ర‌ణంతో  రెండో తారీఖు విడుద‌ల చేద్దాం అనుకున్నారు. కానీ ఈ లోగానే 1వ తారీఖు రాత్రే కాలా టీజ‌ర్ ను ఆన్ లైన్ లో పెట్టేశారు. ఖంగు తిన్న నిర్మాత ధ‌నుష్ హ‌డావిడీగా 2వ తారీఖు ఉయ‌ద‌మే స‌డెన్ గా విడుద‌ల చేశాడు. మొద‌ట్లో ఇంత హ‌డావిడీ ఎందుకో అర్థం కాలేదు. కానీ త‌ర్వాత తెలిసింది కాలా పైర‌సీ బారిన ప‌డ్డాడ‌ని. కాలా ఉదంతం మ‌ర్చిపోక‌ముందే ఇప్పుడు రజినీకాంత్ మ‌రో టీజ‌ర్ పైర‌సీకి గురైంది. శంక‌ర్ డైరెక్ష‌న్ లో రజినికాంత్ ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 2.0 టీజ‌ర్ ను కూడా ఎవ‌రో పైరేట్ చేశారు. శంక‌ర్ అంటే టెక్నిక‌ల్ గా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. అలాంటి శంక‌ర్ కు కూడా షాక్ ఇచ్చారంటే వీళ్లెవ‌రో దేశ‌ముదుర్లులా ఉన్నారు. నిజానికి 2.0ఇంకా విఎఫ్ఎక్స్ ప‌నులు పూర్తి చేసుకోలేదు. అయినా స‌డెన్ గా ఎవ‌రో ఇలా చేయ‌డం ఎంటైర్ టీమ్ ను షాక్ కు గురి చేసింది. ఒక‌వేళ విఎఫ్ఎక్స్ టీమ్ లోనే ఎవ‌రైనా లీక్ చేశారా అనే దిశ‌గా ఆరాలు మొద‌లుపెట్టారు.. మొత్తంగా ర‌జినీకాంత్ సినిమాల‌నే టార్గెట్ చేస్తోన్న ఆ ముఠా ఎవ‌రో కానీ.. సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా ఈ పైర‌సీ దారుల చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నారు.
 

More Related Stories