క్లైమాక్స్ లో రజినీ సినీ కెరీర్...?

సూపర్ స్టార్ రజినీకాంత్.. మూడు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీని శాసించిన హీరో. రజినీ పేరు వినిపిస్తేనే పూనకంతో ఊగిపోయే అభిమానుల్ని ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. వయసు మీద పడుతున్నా రోబో లాంటి రిస్కీ ప్రాజెక్ట్స్ తో మెస్మరైజ్ చేశాడు. కానీ గత కొన్నాళ్లుగా రజనీ మేనియా తగ్గిపపోతోంది. లేటెస్ట్ గా తన ఇమేజ్ కు అభిమానుల ఆకాంక్షలకు విరుద్ధం చేస్తోన్న ప్రయత్నాలు కూడా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు పొలిటికల్ ఎంట్రీ కూడా కామెడీగా మారిపోయింది. దీంతో ఇక రజినీకాంత్ సినిమాలకు స్వస్తి చెప్పడం మంచిది అన్న స్టేట్మెంట్ ఏకంగా ఆయన కూతురు సౌందర్యే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రజినీ సినిమా సన్యాసం గురించి కొత్తగా వస్తోన్న వార్తలు ఇక ఆయన కెరీర్ క్లైమాక్స్ లో ఉన్న విషయాన్ని బలంగా చెబుతున్నాయి. మరి క్లైమాక్స్ అంటే కాస్త గ్రాండ్ గా ఉండాలి కదా. అందుకే కత్తి లాంటి దర్శకుడిని రంగంలోకి దించుతున్నారు.
కోలీవుడ్ లో శంకర్ తర్వాత సామాజిక స్ప్రుహతో సినిమాలు రూపొందించే దర్శకుడుగా మురుగదాస్ పేరే చెబుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ దెబ్బతినకుండా అతను తెరకెక్కించే కథలు.. ఆలోచనాత్మకంగా ఉంటాయి. ప్రస్తుతం విజయ్ తో మూడో సినిమా చేస్తోన్న మురుగదాస్.. తర్వాత సినిమా రజినీకాంత్ తోనే అన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ అనే యంగ్ డైరెక్టర్ త సినిమా చేస్తున్నాడు. ఇది చాలా వేగంగా పూర్తి చేసుకునేలా ముందే ప్లాన్ చేశారు. ఇక అటు విజయ్,మురుగదాస్ సినిమాల కూడా పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత రజినీ, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా మొదలవుతుందంటున్నారు. అలాగే మురుగదాస్ సినిమాతో తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఓ బలమైన ఐడియలాజికల్ సందేశాన్ని ఇచ్చి.. ఇక పూర్తిగా సినిమాలకు శాశ్వత రిటైర్మెంట్ ప్రకటిస్తాడట. సో.. మురుగదాస్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే భారీ ఎఫెక్ట్ లాంటి సీన్ అన్నమాట.