English   

కూతురి పెళ్లిలో ముత్తుగా మారిన రజనీ !

rajinikanth dance video in soundarya marriage is going to viral on social media
2019-02-11 14:01:40

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ వివాహ వేడుక నేడు వైభవంగా జరిగింది. నటుడు, వ్యాపారవేత్త విశాగన్‌ ను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి వివాహ రద్దు అనంతరం సౌందర్య ప్రేమించి పెద్దల సమ్మతితో విశాగన్‌ను వివాహం చేసుకున్నారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లోని లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పళణిసామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంతోపాటు పలువురు మంత్రులు చివిధ పార్టీల నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నేటి ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల మధ్య వివాహ వేడుక వైభవంగా సాగింది. సినీ ఇండస్ట్రీ నుండి కమల్ హాసన్, మోహన్‌బాబు, సుబ్బరామి రెడ్డి, అనిరుధ్‌ రవిచందర్, ధనుష్‌, ప్రభు, రాఘవ లారెన్స్‌, మంజిమ మోహన్, ఆండ్రియా, మణిరత్నం, సుహాసిని తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు నిన్న జరిగిన ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో తలైవా ‘ముత్తు’ సినిమాలోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూడు రోజులపాటు జరిగిన పెళ్లితంతులో సంగీత్, మెహింది బాగా ఆకట్టుకున్నాయి.

More Related Stories