English   

ర‌జినీ బాషా సీక్వెల్ చేస్తున్నాడా..?

rajinikanth
2018-07-22 18:00:34

అదేంటి.. మొన్న అడిగిన‌పుడు చేయ‌న‌ని చెప్పాడు క‌దా.. మ‌ళ్లీ ఇప్పుడు బాషా సీక్వెల్ ఏంటి అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా క‌థ వింటుంటే ఇది బాషా సీక్వెల్ అనే అనిపిస్తుంది. ఈ చిత్రంలో ర‌జినీకాంత్ మాఫియా డాన్ గానే న‌టిస్తు న్నాడు. ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో జ‌రుగుతుందిప్పుడు. అక్క‌డ ఓ విల్లా తీసుకుని నెల రోజులుగా అక్క‌డే షూటింగ్ చేస్తున్నాడు కార్తిక్. దీనికి ర‌జినీకాంత్ విల్లా అనే పేరు కూడా పెట్టేసారు. 

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ చిత్రంలో ర‌జినీకాంత్ ప‌గ‌టి పూట హాస్ట‌ల్ వార్డెన్ గా.. రాత్రి పూట డాన్ గా న‌టిస్తున్నాడు. ఈ కారెక్ట‌ర్ వేరియేష‌న్స్ ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఈ స‌స్పెన్స్ భ‌రించాల్సిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్రం బాషాకు సీక్వెల్ లా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఎందుకంటే బాషాలోనూ ఆటో డ్రైవ‌ర్ గా ఉంటూనే.. అవ‌స‌ర‌మైనపుడు బాషా బ‌య‌టికి వ‌స్తుంటాడు. ఇక్క‌డ హాస్ట‌ల్ వార్డెన్.. మాఫియా డాన్.. విన‌డానికి విచిత్రంగా అనిపిస్తుంది.. అంతే స్థాయిలో ఆస‌క్తి కూడా పుట్టిస్తుంది. మ‌రి కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమాలో ర‌జినీ ఏం చేస్తాడో.. చేసేవాడో తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వేచి చూడాల్సిందే..

More Related Stories