English   

కొడ‌తారేమో చూస్కో రంజిత్..!

rajinikanth fans fire on ranjith

ఇప్పుడు నిజంగానే ర‌జినీకాంత్ అభిమానులు ఈ కుర్ర ద‌ర్శ‌కుడిపై అంత కోపంగా ఉన్నారు. ఒక‌టి కాదు రెండు అవ‌కాశాలు వ‌ర‌స‌గా ఇస్తే రెంటినీ వాడుకోలేదు ఈ ద‌ర్శ‌కుడు. క‌బాలి కాస్తైనా ప‌ర్లేద‌నిపించింది కానీ కాలా అయితే దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం ర‌జినీ కెరీర్ లోనే ఈ మ‌ధ్య కాలంలో చెత్త ఓపెనింగ్స్ గా నిలిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 60 కోట్లు కూడా రాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు రంజిత్ ను చూసి నిజంగానే కోపంతో ఊగిపోతున్నారు ప్రేక్ష‌కులు. ఇలాంటి టైమ్ లో మ‌రోసారి ఇత‌డికి ర‌జినీ అవ‌కాశం ఇస్తున్నాడ‌నే వార్త‌లే అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్నాయి. అయితే ఈ సారి పూర్తిగా పొలిటిక‌ల్ డ్రామాలో ర‌జినీని చూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు రంజిత్. ఇప్ప‌టికే క‌థ చెప్ప‌డం ఆయ‌న ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగిపోయాయ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమాతో బిజీగా ఉన్న ర‌జినీ.. ఆ త‌ర్వాత రంజిత్ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు త‌మిళ‌నాట బాగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటి టైమ్ లో రంజిత్ కానీ బ‌య‌ట క‌నిపిస్తే ర‌జినీ అభిమానులు కొట్టేలా ఉన్నారు. క‌బాలికే కోపం తెచ్చుకున్న ఫ్యాన్స్.. కాలాతో మండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మూడోసారి కూడా ర‌జినీతో ఆఫ‌ర్ కొట్టేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫ్యాన్స్ మాత్రం ఆయ‌నకు ఎందుకు అవ‌కాశం ఇస్తున్నావ్ త‌లైవా అంటూ ర‌జినీని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈయ‌న‌లో ఆయ‌నేం చూసాడో తెలియ‌దు క‌దా..! మ‌రి క‌నీసం మూడోసారైనా రంజిత్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని చేస్తాడా..? ఈ సారి మాత్రం ఏదైనా తేడా కొడితే ఇంటికి వ‌చ్చి మ‌రీ ఫ్యాన్స్ కొడ‌తారు అన‌డంలో మాత్రం ఆశ్చ‌ర్యం లేదు. అందుకే కాస్త చూస్కో రంజిత్..!

More Related Stories