English   

హిమాల‌యాల‌కు ర‌జినీకాంత్.. 

Rajinikanth-Himalayas
2018-03-10 11:42:23

ర‌జినీకాంత్ ప్ర‌యాణం మ‌ళ్లీ హిమాల‌యాల వైపు ప‌డింది. ఇప్ప‌టికే రాజ‌కీయాల వైపు అడుగేసిన ర‌జినీ.. ఇప్పుడు ప్ర‌శాంత‌త కోసం ప్ర‌తీ ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా హిమాల‌యాకు వెళ్లారు. మార్చ్ 10న ఈయ‌న ప్ర‌యాణం మొద‌లైంది. అక్క‌డే కొన్ని రోజులు ఉండ‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. ర‌జినీ హిమాల‌యాల‌కు వెళ్ల‌డం కొత్త కాదు. ప్ర‌తీ ఏడాది అక్క‌డికి వెళ్లి కొన్ని రోజులు ధ్యానం చేసుకుని వ‌స్తారు సూప‌ర్ స్టార్. ఇప్పుడు కూడా ఆయ‌న సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు కాలా.. మ‌రోవైపు 2.0 పూర్తి చేసిన త‌ర్వాత ఈ మ‌ధ్యే కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా క‌మిట‌య్యాడు ర‌జినీకాంత్. హిమాల‌యాల్లో కొన్నిరోజులు ఉండి.. ధ్యానం చేసుకుని వ‌చ్చాక జీవితంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటాడ‌ని ఆశిస్తున్నారు అభిమానులు. ఇప్ప‌టికే హిమాల‌యాల్లో కొంత స్థ‌లం కూడా కొన్నాడు ర‌జినీ. అక్క‌డే ఉండే సాధువుల‌కు సొంతంగా ఓ ఆశ్ర‌మం క‌డుతున్నాడు సూప‌ర్ స్టార్. 

ఇక హిమాల‌యాల‌తో పాటు రాజ‌కీయాల‌పై మ‌న‌సు బాగా ప‌డిన‌ట్లుంది. అందుకే ఒప్పుకున్న సినిమాల‌ను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. సాధార‌ణంగా ర‌జినీ సినిమా అంటే ఎప్పుడు మొద‌లై ఎప్ప‌టికి పూర్తవుతుందో క్లారిటీ ఉండ‌దు. పైగా ఆయ‌న్నుంచి ఒక్కో సినిమా రావాలంటే కనీసం రెండేళ్లైనా ప‌డుతుంద‌ని ఫిక్సైపోయారు అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు ర‌జినీ. ఓవైపు క‌మ‌ల్ రాజ‌కీయాల్లో బిజీ అవుతుంటే ఈయ‌న విచిత్రంగా సినిమాల‌తో బిజీ అవుతున్నాడు. కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా కూడా ఈ ఏడాదే పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. దీన్ని ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇది పొలిటిక‌ల్ స‌బ్జెక్ట్. ర‌జినీ రాజ‌కీయ అరంగేట్రానికి ప‌నికొచ్చేలా ఈ స్క్రిప్ట్ ఉంద‌ని తెలుస్తుంది. మొత్తానికి త్వ‌ర‌గా ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్.

More Related Stories