English   

సూప‌ర్ స్టార్ కు రుణ‌ప‌డిన‌ సూప‌ర్ స్టార్.. 

rajinikanth-mahesh
2018-04-12 10:54:52

ఇండ‌స్ట్రీకి ఓ సూప‌ర్ స్టార్ ఉంటాడు. కానీ ఇండియ‌న్ వైడ్ గా ఉన్న‌ది ఒకే ఒక్క సూప‌ర్ స్టార్.. ఆయ‌నే ర‌జినీకాంత్. త‌మిళ్ కే కాదు.. ఆయ‌న స్టైల్ తో ఇండియ‌న్ వైడ్ గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ర‌జినీ. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే భాష‌తో ప‌నిలేదు.. అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ భారీ అంచ‌నాలే ఉంటాయి. అందుకే ర‌జినీ వ‌స్తున్న టైమ్ లో ఇత‌ర సినిమాలేవీ పెట్టుకోరు. కానీ ఈ సారి మాత్రం విచిత్రంగా కాలా వ‌స్తుంద‌ని తెలిసినా కూడా తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మాత్రం ఆయ‌న‌కు ఎదురెళ్లాడు. భ‌ర‌త్ అనే నేను ఎప్రిల్ 20న విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యాడు. దానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. ఇప్పుడు కానీ డేట్ మిస్ అయితే మ‌ళ్లీ మంచి డేట్ దొర‌క‌డానికి చాలా రోజులు ప‌డుతుంది. దానికితోడు త‌ర్వాత బ‌న్నీ సినిమా కూడా ఉంది. 
దాంతో దొరికిన ఒక్క తేదీని వాడేసుకున్నాడు సూప‌ర్ స్టార్. అయితే ఎప్రిల్ 27న కాలా విడుద‌ల కానుండ‌టమే మ‌హేశ్ కు ఇన్ని రోజులు టెన్ష‌న్ గా ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. కాలా సినిమా వాయిదా ప‌డింది. ఈ చిత్రం జూన్ కు వెళ్లిపోయింద‌ని తెలుస్తుంది. మే లో కూడా వ‌చ్చేది క‌ష్ట‌మే అని అర్థ‌మైపోయింది. దానికి కార‌ణం త‌మిళ‌నాట జ‌రుగుతున్న స‌మ్మె. అందుకే రెండు వారాలే విడుద‌లకు ఉన్నా కూడా ఏ సంద‌డి చేయ‌డం లేదు. దాన్నిబ‌ట్టే సినిమా ఇప్పుడు రావ‌ట్లేద‌ని అర్థ‌మైపోతుంది. దాంతో పండ‌గ చేసుకుంటున్నాడు మ‌న సూపర్ స్టార్. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ఇచ్చిన వరాన్ని.. వారాన్ని పూర్తిగా వాడుకోడానికి సిద్ధ‌మైపోయాడు మ‌హేశ్. మ‌రి చూడాలిక‌.. భ‌ర‌త్ అనే నేనుతో సోలోగా రెండు వారాలు ఈయ‌న బాక్సాఫీస్ ను ఎంత‌గా ద‌త్త‌త తీసుకుంటాడో..? 
 

More Related Stories