English   

రజినీకాంత్  కాలా డేట్ క‌న్ఫార్మ్...?

Rajinikanth-Kaala
2018-04-07 07:46:21

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా. పా రంజిత్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ మూవీకి ర‌జిని అల్లుడు ధ‌నుష్ నిర్మించ‌డం విశేషం. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న కాలాను ఈ నెల 27న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో టాలీవుడ్ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ విష‌యంలో చాలా మార్పులు, గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి. కానీ తీరా త‌మిళ‌నాడులో థియేట‌ర్స్ , షూటింగ్స్ బంద్ వ‌ల్ల కాలా రిలీజ్ డేట్ మారింది. ఒక్క‌సారిగా వ‌చ్చిన ఈ మార్పుకు టాలీవుడ్ కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. కానీ అప్ప‌టికే భ‌రత్ అనేనేను 20కి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మే 4కు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ కాలా ఎప్పుడు వ‌స్తాడో అనుకుంటోన్న వారికి లేటెస్ట్ గా ఓ కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 27 నుంచి ఏకంగా రెండు నెల‌లు వెన‌క్కి వెళ్లిపోయాడు ర‌జినీ. ప్ర‌స్తుతం వినిపిస్తోన్న దాన్ని బ‌ట్టి కాలా స‌రిగ్గా తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ స్టార్ట్ చేసే రోజునే రాబోతున్నాడు.. అంటే జూన్ 12. ఎప్పుడో పూర్తైన సినిమాను మ‌రీ అంత దూరం ఎందుకు తీసుకువెళ్లారు అనుకుంటున్నారా.. అందుకూ ఓ రీజ‌నుంది. ఇప్ప‌టికే బంద్ కార‌ణంగా చాలా సినిమాలు విడుద‌ల వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు త‌ను ముందుకు వస్తే ఆ సినిమాలు ఇబ్బంది ప‌డ‌తాయి. అందుకే త‌నే వెన‌క్కి వెళ్లాడు కాలా. ఈ లోగా కాలా కంటే ముందే డేట్స్ అనౌన్స్ చేసుకున్న సినిమాల‌న్నీ వ‌చ్చేస్తాయి. ఆ త‌ర్వాత కాలా వ‌స్తాడు. అఫ్ కోర్స్ ర‌జినీకాంత్ సినిమాకు సీజ‌న్ తో ప‌నేంటి.. ఆయ‌న సినిమా ఎప్పుడు వ‌స్తే అప్పుడే క‌దా సీజ‌న్..

More Related Stories