English   

ట్రెండ్ ఫాలో అవుతున్న కాలా.. 

Rajinikanth-kaala

ర‌జినీకాంత్ కు వ‌య‌సు 70కి చేరువైంది కానీ ఆయ‌న ఇంకా కుర్రాడే. ఇమేజ్ లో ఆయ‌న‌కు ఇంకా పోటీ ఇచ్చే హీరో సౌత్ ఇండియాలో రాలేదు. ఇక రాడు కూడా.. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమాలంటే అంత మోజు మ‌రి ప్రేక్ష‌కులకు. ఇప్పుడు కాలా సినిమాతో వ‌చ్చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. జూన్ 7న ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యు బై ఏ స‌ర్టిఫికేట్ అందుకున్న కాలా.. ఏకంగా మూడు గంట‌ల‌కు కేవ‌లం 10 నిమిషాలు త‌క్కువ నిడివితో వ‌స్తుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంత సేపు ప్రేక్ష‌కుల‌ను కూర్చోబెట్టేంత స‌త్తా సినిమాలో ఉందా అని..? క‌బాలిని కూడా భారీ నిడివితో తీసుకొచ్చాడు రంజిత్. కానీ అది అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. త‌మిళ్ లో ర‌జినీ ఇమేజ్ తో ఆడేసింది కానీ తెలుగులో ఆ సినిమా డిజాస్ట‌ర్. ఇలాంటి టైమ్ లో కాలా ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. అయితే ఇప్పుడు తెలుగులో ఓ ట్రెండ్ న‌డుస్తుంది. భారీ నిడివి ఉన్న సినిమాలు బాగానే ఆడుతున్నాయి. అర్జున్ రెడ్డి.. రంగ‌స్థ‌లం.. భ‌ర‌త్ అనే నేను.. మ‌హాన‌టి మూడు గంట‌ల‌తో వ‌చ్చి అల‌రించాయి. ఈ ట్రెండ్ లోనే కాలా కూడా వెళ్తుంద‌ని న‌మ్ముతున్నాడు ర‌జినీకాంత్. గ‌తంలో ర‌జినీ సినిమాల‌పై ఉన్న అంచ‌నాల‌తో పోలిస్తే ఈ సారి కాలా చాలా లో ఎక్స్ పెక్టేష‌న్స్ తో వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. కాలా తెలుగులో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..? 

 

More Related Stories