English   

రజినీకాంత్ చివరి సినిమా

rajinikanth

కొన్ని కాంబినేషన్స్ భలే సర్ ప్రైజ్ చేస్తాయి. మీడియం రేంజ్ డైరెక్టర్ సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడంటే ఇంక ఆ కాంబినేషన్ కు వచ్చే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలని కలలు కనని దర్శకులుండరు. కానీ అందుకు కావాల్సింది కలలు కాదు కంటెంట్. ఆ విషయంలో ఫస్ట్ మూవీ నుంచి ది బెస్ట్ అనిపించుకుంటోన్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఏ పాయింట్ చెప్పినా థ్రిల్లింగ్ గా చెప్పడం సుబ్బరాజ్ స్టైల్. ఇప్పటికే తమిళ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చకున్న కార్తీక్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నాడు. యస్.. ఈ మధ్య యంగ్ టాలెంట్ తో కలసి ఎక్కువగా వర్క్ చేస్తోన్న సూపర్ స్టార్ లేటెస్ట్ గా చాలామంది యంగ్ టాలెంట్ చెప్పిన కథలు విన్నాడట. రజినీకి కథలు చెప్పిన వారిలో హ్యాట్రిక్ డైరెక్టర్ ఆట్లీ కూడా ఉన్నాడు. నిజానికి మేర్సల్ చూసిన తర్వాత ఆట్లీకే చాన్స్ ఇస్తాడనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ లక్కీ చాన్స్ కార్తీక్ సుబ్బరాజ్ కు వచ్చింది. అయితే ఈ విషయంలో కార్తిక్ తో చేయడమే రజినీ అదృష్టం అనేవారూ లేకపోలేదు. 

మొత్తంగా ఈక్రేజీ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేసే చాన్స్ ను సన్ టివి దక్కించుకుంది. కళానిధి మారన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వీలైనంత త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. అన్నట్టు రజినీ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నాడు కాబట్టి.. ఇక ఇదే సూపర్ స్టార్ చివరి సినిమా అని కూడా వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో కానీ.. నిజమైతే దాన్ని మోస్ట్ మెమరబుల్ మూవీగా చేయాల్సిన బాధ్యత కార్తీక్ సుబ్బరాజ్ దే.

More Related Stories