English   

ర‌జినీ రాజ‌కీయాల‌కు హ్యాండిచ్చిన‌ట్లేనా..? 

rajinikanth
2018-05-11 11:41:12

అదేంటి.. ఈ మ‌ధ్యే క‌దా.. అంద‌రి సాక్షిగా అంతఃక‌ర‌ణ శుద్ధితో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ రేంజ్ లో చెప్పాడు ర‌జినీ.. అప్పుడే మ‌ళ్లీ హ్యాండివ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా...? ఏమో ఇప్పుడు ఈయ‌న తీరు చూస్తుంటే మాత్రం ఇదే అనిపిస్తుంది. ఈయ‌న‌కు పాలిటిక్స్ ఇష్టం లేవ‌ని తెలుసు.. ఎప్ప‌ట్నుంచో చెబుతున్న మాటే కానీ వ‌స్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా ఇంకా ఇష్టం లేన‌ట్లుండ‌టం ఇప్పుడు అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. లేక‌పోతే మ‌రేంటి..? ఓ వైపు క‌మ‌ల్ హాస‌న్ సినిమాలు మానేసి ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నాడు. ఎన్నిక‌ల కోసం ఇప్ప‌ట్నుంచే పార్టీ క్యాడ‌ర్ ను సిద్ధం చేసుకుంటున్నాడు. మ‌రోవైపు ఇత‌ర పార్టీలు కూడా ఇదే ప‌ని మీద బిజీగా ఉన్నాయి. కానీ ఎన్నిక‌ల్లో పోటీకి వ‌స్తాన‌ని చెప్పిన ర‌జినీ మాత్రం సినిమాలు చేస్తూ కూర్చున్నాడు. కాలా అయిపోయింది.. 2.0 రెడీగా ఉంది.. కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంతోనే బిజీ కానున్నాడు ర‌జినీకాంత్. 

ఇది పూర్తి కావ‌డానికి క‌నీసం ఆర్నెళ్లైనా ప‌డుతుంది. ఇలాంటి టైమ్ లో ఆయ‌న నుంచి అద్భుతాలు ఆశించ‌లేం. ఆశించ‌డానికి ఇది సినిమా కూడా కాదు. డిసెంబ‌ర్ వ‌ర‌కు కార్తిక్ సినిమాతోనే బిజీగా ఉండే ర‌జినీకి.. మూన్నెళ్లు స‌రిపోతాయా రాజ‌కీయాల కోసం..? ఇదేమైనా సినిమానా.. కోర‌గానే సిఎం ప‌ద‌వి వ‌చ్చి ఒళ్లో వాల‌డానికి..? ర‌జినీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆచుతూచి అడుగు వేయ‌క‌పోతే రాజ‌కీయాల్లో బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. దీనికి చిరంజీవినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఎనిమిది నెల‌ల ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఎన్నిక‌ల్లో పోటీ చేసి దారుణంగా బోల్తా కొట్టాడు మెగాస్టార్. అంత మాస్ ఇమేజ్ ఉన్నా కూడా స‌రిగ్గా ప్లాన్ చేసుకోక‌పోతే రాజ‌కీయాల్లో ఫ్లాప‌వ‌డం ఖాయం. మ‌రి ఇలాంటి టైమ్ లో ర‌జినీ ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories