English   

2.0 ను అలా ముగించేస్తున్నారా..? 

Rajinikanth-Robot

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే.. చుట్ట కాలింద‌ని మ‌రొక‌రు ఏడ్చాడంట‌.. ఇప్పుడు 2.0 ప‌రిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అస‌లే సినిమా విడుద‌ల కావ‌డం లేద‌ని ఇటు అభిమానులు.. అటు ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. ఈ విష‌యంలో ర‌జినీకాంత్ కూడా ఏమీ చేయ‌లేక ఇత‌ర సినిమాలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు 2.0కు అనుకోని అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. దీవాళికి సినిమా విడుద‌ల చేయాల‌నుకున్నాడు శంక‌ర్. కానీ అప్పుడు అమీర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంటూ వ‌చ్చేస్తున్నాడు. ఈయ‌న సినిమాతో పోటీ అంటే ఇప్పుడు అస‌లుకే మోసం వ‌స్తుంది. ఇక క్రిస్మ‌స్ కు షారుక్ ఖాన్ జీరో అంటూ వ‌స్తున్నాడు. టైటిల్ జీరో అయినా ఆయ‌న హీరోనే క‌దా.. అందుకే ఆయ‌న‌తో కూడా నో పోటీ అంటున్నాడు శంక‌ర్. పోనీ జ‌న‌వ‌రిలో అంటే అప్పుడు హృతిక్ సూప‌ర్ 30 అంటూ లెక్క‌లు చెప్ప‌డానికి వ‌స్తున్నాడు. అస‌లే ఇప్పుడు ర‌జినీకాంత్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈయ‌న త‌న స్టామినా నిరూపించుకోవాలంటే 2.0 వ‌చ్చి తీరాల్సిందే. ఒక్క హిట్ ప‌డితే కానీ ఆయ‌న కెరీర్ ఇప్పుడు గాడిన ప‌డ‌దు. ఇలాంటి స‌మ‌యంలో కోరి బాలీవుడ్ హీరోల‌తో పోటీ ప‌డ‌టం మంచిది కాదు. పైగా ఈ చిత్ర బ‌డ్జెట్ కూడా 400 కోట్ల‌కు పైగానే ఉంది. అంటే అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ క‌లెక్ష‌న్లు ముఖ్యం. దాంతో తానే కాంప్ర‌మైజ్ అయి మంచి డేట్ కోసం చూస్తున్నాడు శంక‌ర్. అంటే 2018లో 2.0 రాద‌ని అర్థ‌మైపోయింది.. వ‌చ్చే ఏడాదికి సినిమా వాయిదా ప‌డింది. క‌నీసం అప్పుడైనా వ‌స్తుంది అనే క్లారిటీ ఇవ్వ‌ట్లేదు శంక‌ర్. మ‌రి ఈ చిత్రంతో ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories