English   

2.0 సెన్సార్ అయింది.. అసలు 2.0 కథ ఏంటో తెలుసా..?

Rajinikanth’s 2point0 Movie Censor Completed Without Single Cut
2018-11-14 07:16:55

2.0.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. విడుద‌ల‌కు మ‌రో 17 రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో ప్ర‌మోష‌న్స్ లో మ‌రింత‌గా జోరు పెంచేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తైపోయింది ఈ చిత్రానికి. యు బై ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఒక్క క‌ట్ కూడా లేకుండా ఇది రావ‌డం మ‌రో విశేషం. సినిమా మొద‌ట్లోనే అక్ష‌య్ కుమార్ చ‌నిపోవ‌డం.. ఆ త‌ర్వాత క‌థ మొద‌ల‌వ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. త‌ర్వాత సెన్ ఫోన్ వాడుకున్న ప్ర‌తీ ఒక్క‌రిని అక్ష‌య్ ఇబ్బంది పెట్ట‌డం.. అప్పుడు దాన్ని అరిక‌ట్ట‌డానికి మ్యూజియంలో ఉన్న చిట్టిని మ‌ళ్లీ రీ లోడ్ చేస్తాడు వ‌శీక‌ర‌ణ్. అప్ప‌ట్నుంచి అస‌లు ర‌చ్చ మొద‌ల‌వుతుంది.

మొన్న విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాపై అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ టాక్ విన్న త‌ర్వాత సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీని మార్చేలా క‌నిపిస్తుంది. ఏడాదిన్న‌ర‌గా ఈ చిత్రం కోసం వేచి చూస్తూనే ఉన్నారు అభిమానులు. 2017 న‌వంబ‌ర్ లోనే ఆడియో లాంచ్ జ‌రిగినా కూడా ఏడాది త‌ర్వాత మొన్న ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఇంత లేట్ అయినా ర‌జినీకాంత్ మాత్రం సినిమాపై మంచి న‌మ్మ‌కంతో ఉన్నాడు. కొన్నిసార్లు ఆల‌స్యం అయిన‌పుడే సినిమా విలువ కూడా తెలుస్తుంద‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. ఆల‌స్యం అయినా కూడా ఏం ప‌ర్లేద‌ని క‌చ్చితంగా 2.0 ప్ర‌పంచం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమా అవుతుంద‌ని చెప్పాడు ర‌జినీకాంత్. మ‌రి చూడాలిక‌.. సినిమా ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో..?

More Related Stories