English   

ర‌జినీ అంద‌ర్నీ గుర్తు చేసుకున్నాడుగా..!

rajinikanth speech sr ntr dasari

ర‌జినీకాంత్ పేరుకు త‌మిళ హీరో కానీ ఈయ‌న‌కు తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అస‌లు ఈయ‌న్ని త‌మిళ హీరో అన‌డం కూడా త‌ప్పే. ఎందుకంటే ఒక్కోసారి మ‌న హీరోల‌కు కూడా సాధ్యం కాని రికార్డుల‌ను డ‌బ్బింగ్ సినిమాల‌తో బ‌ద్ధ‌లు కొడుతుంటాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు కూడా ఈయ‌న కాలా సినిమాతో వ‌స్తున్నాడు. జూన్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు చిత్ర‌యూనిట్. హైద్రాబాద్ లోనే జ‌రిగిన ఈ వేడుక‌కు ర‌జినీకాంత్ కూడా వచ్చారు. ఈయ‌నేం మాట్లాడ‌తారో అని ఆస‌క్తిగా చూసిన అంద‌రికీ సీనియ‌ర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసారు. ఎప్పుడు తాను హైద‌రాబాద్ కు వ‌చ్చినా కూడా పెద్దాయ‌న ఆశీస్సులు తీసుకునేవాన్ని అని.. ఆ త‌ర్వాత త‌న‌ను అంత‌గా కొడుకు మాదిరి చూసుకున్న వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ‌రావు అని.. ఇప్పుడు ఇద్ద‌రూ లేక‌పోవ‌డం త‌న‌కు బాధ క‌లిగిస్తుంద‌ని చెప్పి ఇక్క‌డి వాళ్ల మ‌న‌సులు దోచేసారు ర‌జినీకాంత్. ఈయ‌న స్పీచ్ లో ఈ రెండు ముక్క‌లతో దెబ్బ‌కు మ‌ళ్లీ ర‌జినీపై గౌర‌వం అలా అలా పైకి పెరిగిపోయింది. పైగా ఇక్క‌డ ఉన్న‌ది ఒకే ఒక్క ర‌జినీకాంత్ అని ధ‌నుష్ చెప్తే.. ఒక్క‌డే చిరంజీవి.. బాల‌య్య‌.. వెంక‌టేశ్.. నాగార్జున అంటూ అంద‌రి పేర్లు చెప్పి ఫ్యాన్స్ ను ఖుషీ చేయించాడు ర‌జినీకాంత్. ఈయ‌న స్పీచ్ తో మ‌ళ్లీ కాలాపై అంచ‌నాలు అలా పెరిగిపోయాయి. మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాతో సూప‌ర్ స్టార్ ఏం సంచ‌ల‌నం సృష్టిస్తాడో..?  

More Related Stories